కరోనా (Corona) మహమ్మారి ప్రభావం తగ్గిందని ప్రపంచం మొత్తం ఊపిరి పీల్చుకున్న సమయంలో తాజాగా చైనా లో HMPV అనే వైరస్ బయటకు వచ్చి మళ్లీ ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది. ఈ వైరస్ భారత్‌ను కలవరపెడుతోంది. ఇప్పటికే పలు చోట్ల ఈ కేసులు బయట పడడంతో దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ, కరోనా కంటే ముందే ప్రపంచాన్ని వణికించిన ఎన్నో ప్రమాదకరమైన వైరస్లు (Dangerous Viruses) ఉన్నాయి. వాటి ప్రభావం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతూనే ఉంది. మొదటగా రోటా వైరస్ గురించి చెప్పుకోవాలి. ఈ వైరస్ చిన్న పిల్లలలో తీవ్రడైరియా కలిగిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షల మంది చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ వైరస్, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది.
Egg Cost : వామ్మో ..కోడి గుడ్డు ధర రూ.700 ఏంటో అంత స్పెషల్ ..?
ఇంకా స్మాల్ పాక్స్ (చర్మగండం) ప్రపంచాన్ని శతాబ్దాల పాటు భయపెట్టింది. ఈ వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అదే విధంగా మీజిల్స్ (తట్టు) కూడా చిన్నారుల ప్రాణాలను పొంచి ఉన్న ప్రమాదకర వైరస్‌గా చరిత్రలో నిలిచింది. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, ఎల్లో ఫీవర్ వంటి వైరస్లు కూడా ప్రపంచ ఆరోగ్యాన్ని సవాలుగా నిలిపాయి.
ఇతర వైరస్ లో ఫ్లూ, రేబిస్, హెపటైటిస్-బీ&సీ వైరస్లు ముఖ్యమైనవి. ఫ్లూ అనేది ప్రతిఏటా కోటిమందికి పైగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. రేబిస్ మాత్రం బాగా నియంత్రణలోకి వచ్చినప్పటికీ, పశువుల ద్వారా వ్యాపించే ఈ వైరస్ ప్రాణాంతకమైంది. హెపటైటిస్ వైరస్ కారణంగా లివర్ సంబంధిత వ్యాధులు తీవ్రమయ్యాయి.
Kims Hospital : శ్రీతేజ్ ను పరామర్శించిన అల్లు అర్జున్
ఎబోలా, హెచ్ఐవీ వంటి వైరస్లు మాత్రం ఇప్పటికీ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఎబోలా వైరస్, ప్రధానంగా ఆఫ్రికా ఖండంలో నరమేధం సృష్టించగా, హెచ్ఐవీ వైరస్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికించింది. ఇవి మానవాళికి తలపెట్టిన ప్రాణహాని తలచుకుంటే, వైరస్‌ల నియంత్రణకు ఎంతగా శ్రద్ధ తీసుకోవాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికి ప్రతి మనిషి ఆరోగ్య నియమాలు పాటిస్తూ , శుభ్రతలు పాటిస్తే ఎలాంటి వైరస్ లు రావని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.