Site icon HashtagU Telugu

Toothpaste On Burn: కాలిన గాయాలకు టూత్ పేస్ట్ రాస్తే నిజంగానే ఉపశమనం లభిస్తుందా.. వైద్యుల సమాధానం ఇదే!

Toothpaste On Burn

Toothpaste On Burn

సాధారణంగా కొన్ని చిన్న చిన్న కారణాలవల్ల అజాగ్రత్త వల్ల కాళ్లు చేతులు లేదా శరీర భాగాలు కాలుతూ ఉంటాయి. వీటివల్ల మంట వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పదార్థాలు తగిలినప్పుడు విపరీతమైన మంటతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఏదైనా ప్రదేశంలో కాలినప్పుడు వెంటనే చేసే పని అక్కడ మనం పళ్ళు శుభ్రం చేసుకుని పేస్ట్ ని అప్లై చేయడం. చేస్తే మంట ఉండదని బొబ్బలు కూడా రావు అని నొప్పి కూడా ఉండదని అంటూ ఉంటారు. ముఖ్యంగా మహిళలు తరచుగా వంట చేస్తున్నప్పుడు కాలినప్పుడు, నూనె వంటి పదార్థాలు చిట్లినప్పుడు ఈ పేస్టుని ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటారు.

మరి పేస్టు నిజంగానే ఉపశమనాన్ని కలిగిస్తుందా? ఆయింట్మెంట్ల పని చేస్తుందా? ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇలా కాలిన ప్రదేశాలపై టూత్‌ పేస్ట్‌ ను ఉపయోగించకూడదట. స్కిన్ బర్న్ మీద టూత్ పేస్ట్ అప్లై చేయడం వల్ల మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది చర్మంపై చల్లగా అనిపిస్తుంది. ఇది మంట నొప్పిని తగ్గిస్తుంది. కానీ మీరు బర్న్ అయిన వెంటనే చర్మం పై టూత్‌ పేస్ట్‌ ను పూయడం మానుకోవాలట. ఎందుకంటే ఇది చర్మం దెబ్బతీస్తుందట. నిజానికి, సోడియం ఫ్లోరైడ్, దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించే టూత్‌ పేస్ట్‌ లలో ఉండే సమ్మేళనం చర్మానికి హానికరం అని చెబుతున్నారు. అలాగే మరెన్నో దుష్ప్రభావాలు చూడవచ్చట.

అందువల్ల చిన్నపాటి కాలిన గాయాల తర్వాత టూత్‌ పేస్ట్‌ ను పూయవద్దని చెబుతున్నారు. స్కిన్ అలర్జీ ఉన్నవారు గాయాలకు టూత్‌ పేస్ట్‌ ను రాయకూడదట. ఎందుకంటే టూత్‌ పేస్ట్‌ లోని రసాయనాలు మీ చర్మానికి కనిపించే హానిని కలిగిస్తాయట. దీని వల్ల అసాధారణ దురద, చికాకు, పొక్కులు కనిపిస్తాయట. కాగా టూత్ పేస్టును చర్మానికి రాసుకుంటే అందులోని రసాయనాలు చల్లదనాన్ని అందిస్తాయి. తరువాత మీ చర్మంలో కొంత భాగం కొద్దిగా తిమ్మిరి అనుభూతి చెందుతుంది. ఇది మీ చర్మం పై పొరను అడ్డుకుంటుందట. చర్మం లోకి చొచ్చుకుపోయే రసాయనాలు ఫస్ట్ డిగ్రీ కాలిన గాయాలను మరింత తీవ్రతరం చేస్తాయట. ఈ రసాయనాలు చర్మంపై దద్దుర్లు, మచ్చలు, ఇన్ఫెక్షన్లు మొదలైన వాటికి కారణమవుతాయని చెబుతున్నారు.