Site icon HashtagU Telugu

Toothache: పంటినొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Toothache

Toothache

మామూలుగా చాలామంది పంటి నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ పంటి నొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. పన్ను పుచ్చిపోవడం పళ్ళు సెన్సిటివ్గా అవ్వడం, తీపి పదార్థాలు ఎక్కువగా తిన్నప్పుడు ఇలా ఎన్నో కారణాల వల్ల పంటి నొప్పి వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఇటువంటి నొప్పికి ఉల్లిపాయతో చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.

మీకు పంటి నొప్పి ఎక్కడ అయితే ఉంటుందో అక్కడ ఉల్లిపాయ ముక్కను ఉంచాలి. అలా పది నిమిషాల పాటు ఉంచిన తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా రెండు మూడు వారాలపాటు చేస్తే పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. పళ్లకు ఉల్లిపాయలు వాడితే దుర్వాసన సమస్య వస్తుందని అందరూ భావిస్తారు కానీ ఉల్లిపాయని ఉప్పుతో కలిపి ఉపయోగిస్తే ఎటువంటి సమస్య ఉండదు ఇది దంతాలని శుభ్రం చేయడమే కాకుండా దంతాల నొప్పిని కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు. ఉల్లిపాయను రెండు ముక్కలుగా కట్ చేసి దానిమీద ఉప్పు చల్లి నొప్పి ఉన్న పన్నుపై బాగా రుద్దాలి.

ఇలా చేయటం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట. అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయలను కలిపి ఉపయోగించడం వల్ల కూడా అనేక దంత సమస్యలను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒక గిన్నెలో ఉప్పు నిమ్మరసం మిశ్రమాన్ని బాగా కలిపి అందులో ఉల్లిపాయ ముక్కను అద్ది నొప్పి ఉన్న ప్రదేశంలో కాస్త అప్లై చేస్తున్నట్టు చేయడం వల్ల వెంటనే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.

Exit mobile version