ఎలాంటి నొప్పినైనా భరించవచ్చు కానీ…పంటి నొప్పి మాత్రం భరించలేం. ఇంకా చెప్పాలంటే పంటి నొప్పి ఎంత దారుణంగా ఉంటుందో నొప్పిని అనుభవించే వారికే తెలుస్తుంది. పంటి నొప్పికి చాలా నివారణలు ఉన్నాయి. అయితే కొన్ని నేచురల్ హోం రెమెడీస్ గతంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.
లవంగాలు:
పంటి నొప్పికి లవంగం దివ్యౌషధం. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే లవంగాలలో పంటి నొప్పిని తగ్గించే గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ ఎఫెక్ట్ ఉండడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉండడం వల్ల పంటి నొప్పిని తగ్గిస్తుంది. లవంగం పంటి నొప్పిని మాత్రమే కాకుండా చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ను కూడా దూరం చేస్తుంది. మీరు పంటి నొప్పి ఉన్న ప్రాంతంలో రెండు లవంగాలను ఉంచి వాటిని నమలాలి. అప్పుడు లవంగాల నుండి వచ్చే రసం పంటి నొప్పి నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది. లవంగం పంటి నొప్పికి మాత్రమే కాకుండా మధుమేహం మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది
వెల్లుల్లి:
పంటి నొప్పికి మరో ఔషధం పచ్చి వెల్లుల్లి. వెల్లుల్లిని పంటి నొప్పికి యాంటీబయాటిక్‌గా కూడా ఉపయోగించవచ్చు. వెల్లుల్లి చిగుళ్లపై బ్యాక్టీరియా ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఒక రెండు పచ్చి వెల్లుల్లిని నమిలి దాని రసాన్ని త్రాగాలి. అలాగే వెల్లుల్లిని మెత్తగా నూరి ఉప్పు కలిపి దంతాలు, చిగుళ్ల నొప్పి ఉన్న చోట రాసి కాసేపు అలాగే ఉంచాలి.
ఉల్లిపాయ:
ఉల్లిపాయలో యాంటీ మైక్రోబియల్, యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇది పంటి నొప్పిని తగ్గించడమే కాకుండా నొప్పి, చిగుళ్ల ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే సూక్ష్మక్రిములను చంపుతుంది.
పంటి నొప్పి ఉంటే పచ్చి ఉల్లిపాయను తీసుకుని కాసేపు నమలండి. దీంతో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. దంతాలు, చిగుళ్ల నొప్పులు ఉంటే ఉల్లిపాయను మెత్తగా గ్రైండ్ చేసి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయండి.
ఐస్ క్యూబ్స్ :
పంటి నొప్పి సమస్య తీరాలంటే చిగుళ్లు, నరాలకు ఉపశమనం కలిగించి నొప్పిని తగ్గించే గుణాలు ఐస్ క్యూబ్ లో ఉన్నాయి. రిఫ్రిజిరేటర్ నుండి ఐస్ క్యూబ్స్ తీసి ప్లాస్టిక్ సంచిలో పెట్టండి. మీ గడ్డం దగ్గర పెట్టుకోండి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేస్తే పంటి నొప్పి సమస్య తీరిపోతుంది. మీకు తీవ్రమైన పంటి నొప్పి ఉంటే, మీరు నేరుగా ఐస్ క్యూబ్ తీసుకొని పంటిపై ఉంచవచ్చు.
వేడి నీరు, ఉప్పు:
ఉప్పు మీ పంటి నొప్పికి సహజ నివారణగా ఉపయోగించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇలా రోజుకు మూడు నాలుగు సార్లు చేస్తే పంటి నొప్పి, చిగుళ్ల సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి.