Vitamin-D: శరీరంలో విటమిన్ డి అధికమైతే ఏం జరుగుతుందో తెలుసా?

శరీరానికి అవసరమైన విటమిన్స్ లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి కొన్ని రకాల ఆహార పదార్థాలు, సూర్యరశ్మీ నుంచి కూడా లభిస్తుంది. ఆరోగ్యాన్ని

  • Written By:
  • Publish Date - July 7, 2023 / 10:15 PM IST

శరీరానికి అవసరమైన విటమిన్స్ లో విటమిన్ డి కూడా ఒకటి. విటమిన్ డి కొన్ని రకాల ఆహార పదార్థాలు, సూర్యరశ్మీ నుంచి కూడా లభిస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని మెరుగుపరచుకోవడానికి విటమిన్-డి ఎంతో ముఖ్యం. రోగనిరోధక శక్తిని పెంచడంలో విటమిన్-డి పాత్ర ఎంతో కీలకమైంది. విటమిన్-డి తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ మరీ ఎక్కువ ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు వైద్యులు. కడుపులో అసౌకర్యం, అసాధారణ మానసిక పరిస్థితి, మూత్రపిండాల సమస్య ఇలా చాలా సమస్యలు తలెత్తుతాయి.

అలాగే విటమిన్-డి అధికంగా ఉంటే ఈ సమస్యలు వస్తాయి. ఎటువంటి సమస్యలు వస్తాయి అన్న విషయానికి వస్తే.. రక్తస్థాయిలు పెరుగుతాయి. విటమిన్-డి శరీరంలో విషపూరితమైన లేదా ప్రమాదకరమైన స్థాయికి చేరుకోవాలంటే అది ప్రతి మిల్లీ లీటరుకు 100 నానోగ్రాములకు మించి ఉండాలి. హైపర్విటమినోసిస్ డి అనేది 100 నానోగ్రాములకు మిల్లీ లీటర్ల కంటే రక్తంలో విటమిన్ డి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. అధిక మోతాదులో విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నప్పటికీ ఆరోగ్యకరమైన వ్యక్తి రక్తంలో విటమిన్ డి స్థాయిలు అధికం అవడం అంటూ ఉండదు. మనం తినే ఆహారం నుండి కాల్షియాన్ని గ్రహించడానికి విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి అత్యంత కీలక పాత్ర ఇది.

విటమిన్ డి అధికంగా ఉంటే అది రక్తంలో కాల్షియం ఎక్కువగా ఉండేలా చేస్తుంది. విటమిన్ డి అధికంగా ఉంటే అది హైపర్కాల్సెమియాకు దారి తీస్తుంది. హైపర్ కాల్సేమియా అంటే రక్తంలో కాల్షియం స్థాయిలు ఎక్కువగా ఉండటం. హైపర్ కాల్సెమియా లక్షణాలు.. వాంతులు, వికారం, మలబద్దకం, కడుపునొప్పి,అలసట, మైకం, భ్రాంతులు, గందరగోళం, ఆకలి లేకపోవడం, అధిక మూత్ర విసర్జ, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ వైఫల్యం,అధిక రక్తపోటు గుండె కొట్టుకునే వేగంలో మార్పులు, డీహైడ్రేషన్ వంటివి లక్షణాలుగా చెప్పుకోవచ్చు. విటమిన్ డి అధికంగా ఉండటం వల్ల తలెత్తే హైపర్ కాల్సెమియా ఉన్న వ్యక్తులు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గందరగోళం, నిరాశ, సైకోసిస్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

మరీ తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి కూడా వెళ్లవచ్చు. అలాగే శరీరంలో విటమిన్ డి అధికంగా ఉంటే అది కిడ్నీ సమస్యలకు దారి తీస్తుంది. విటమిన్ డి అధికంగా ఉంటే అది అధిక స్థాయి కాల్షియానికి దారి తీస్తుంది. దీని వల్ల తరచూ మూత్ర విసర్జన జరుగుతుంది. అలాగే మూత్ర పిండాల్లో సమస్యలు వస్తాయి. హైపర్ కాల్సెమియా మూత్రపిండాల రక్త నాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. ఇది మూత్ర పిండాల పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. విటమిన్ డి లోపం వల్ల కూడా మూత్ర పిండాల సమస్యలు తలెత్తుతాయి..