Health Tips: మధుమేహం రక్తపోటు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే పరగడుపున ఈ ఆకులు తీసుకోవాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ అలాగే రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ స

Published By: HashtagU Telugu Desk
Mixcollage 27 Feb 2024 03 09 Pm 4133

Mixcollage 27 Feb 2024 03 09 Pm 4133

ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ అలాగే రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్నా పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడడానికి వీటిని తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఇంగ్లీషు మందులను ఉపయోగించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతోంది. మీరు కూడా ఈ సమస్యలతో బాధపడుతుంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయితే చాలు. ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు. అయితే అందుకోసం మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నాలుగు ఆకులు తింటే మీ షుగర్ లెవెల్ అలాగే బీపీ లెవెల్ అదుపులో ఉంటాయి.

దీనికంటే సులువైన మార్గం ఇంకోటి ఉండదు. అయితే ఈ ప్రధానమైన నాలుగు రకాల ఆకులని మీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తింటే గనక ఇక రోగాలు మీ దగ్గరికి రావు. అందులో మొదటిది తులసి ఆకులు.. తులసిని మూలికల రాణి అని పిలుస్తారు. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. బయలాజికల్ ప్రాపర్టీస్ తో సమృద్ధిగా నిండు ఉంటుంది. తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది. అదే విధంగా ఇంకొక అద్భుతమైన ఆకు కరివేపాకు. ఇది భారతీయ వంటల్లో ఉపయోగించే ఒక సాధారణ పదార్థం. ఈ ఆకులు జోడించడమే కాకుండా అనేక ఆరోగ్య లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.

కరివేపాకుల్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ తయారు చేసే కణాలను ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అలాగే ఈ కణాలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. మరొకటి వేప ఆకు.. వేపాకుల్లో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. రోజు వేపాకుల్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని తగ్గుతాయని ఆధారాలు ఉన్నాయి. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే మీ రక్తంలో చక్కెర స్థాయిని క్రమం తప్పకుండా మానిటర్ చేసుకోండి. కొన్ని అరుదైన సందర్భాల్లో మీ రక్తంలో చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోతూ ఉంటుంది. ఇక వేపాకులు ఒక ఐదు, కరివేపాకు ఒక ఐదు ఆకులు, అలాగే తులసి ఆకులు ఐదు ఈ మూడింటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎంతో మంచిది. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు చాలా వ్యాధుల భారం నుంచి రక్షించబడతారు. ఇవి హానికరమైన బ్యాక్టీరియా నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తారు. చెప్పినట్టుగా రోజు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం మాత్రం మర్చిపోకండి..

  Last Updated: 27 Feb 2024, 03:09 PM IST