Site icon HashtagU Telugu

National Cancer Awareness Day : క్యాన్సర్‌‌కు మౌత్‌వాష్‌తో లింక్.. ట్రీట్మెంట్‌కు రెండు కొత్త ఆవిష్కరణలు

National Cancer Awareness Day

National Cancer Awareness Day

National Cancer Awareness Day : ఇవాళ ‘నేషనల్ క్యాన్సర్​ అవేర్​నెస్​ డే’. నోబెల్ బహుమతి గ్రహీత మేడమ్ క్యూరీ జయంతిని పురస్కరించుకొని ఈ అవగాహన దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మేడమ్ క్యూరీకి నివాళిగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.  ఈసందర్భంగా క్యాన్సర్​తో పోరాడే బాధితులకు వారి సామర్థ్యాలను గుర్తు చేస్తారు. ఈరోజు ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు, ఎన్జీవోలు క్యాన్సర్ అవేర్​నెస్​ క్యాంపులు నిర్వహిస్తాయి. క్యాన్సర్ రోగ నిర్ధారణ, తీసుకోవాల్సిన చికిత్సలపై అవగాహన కల్పిస్తాయి. ప్రతి సంవత్సరం మనదేశంలో 11 లక్షల కొత్త క్యాన్సర్​ కేసులు నమోదవుతున్నాయి. క్యాన్సర్​ మరణాల రేటులోనూ భారత్ ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలను బట్టి స్పష్టం అవుతోంది. క్యాన్సర్​ను తగ్గించుకోగలిగే ఆప్షన్లు ఉన్నా సరే.. సరైన అవగాహన లేక, సకాలంలో చికిత్స  చేయించుకోక చాలామంది ఈ మహమ్మారి​ బారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ప్రజలకు క్యాన్సర్‌పై అవగాహన ​ కల్పించడం ముఖ్యం.

We’re now on WhatsApp. Click to Join.

క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌కు ఎక్స్‌రే డిటెక్టర్‌

క్యాన్సర్‌ చికిత్సను సులభతరం చేసే ఎక్స్‌రే డిటెక్టర్‌ను బ్రిటన్‌లోని సర్రే యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేశారు. ప్రస్తుతమున్న ఎక్స్‌రే డిటెక్టర్లు బరువైన, దృఢ పదార్థాలతో తయారవుతున్నాయి. పైగా అవి కరెంటును ఎక్కువగా వాడుతున్నాయి. దీనివల్ల వాటి ఖరీదు సైతం ఎక్కువే.  ఇప్పుడు కొత్తగా తయారుచేసిన ఎక్స్‌రే డిటెక్టర్‌ అనేది హైడ్రోజన్‌, కార్బన్‌తో కూడిన ఆర్గానిక్‌ సెమీకండక్టర్ రకానికి చెందినది. అయితే సర్రే యూనివర్సిటీ సైంటిస్టులు ఆర్గానిక్‌ సెమీకండక్టర్‌కు కొన్ని పదార్థాలను జోడించారు. ఫలితంగా చౌకగా ఎక్స్‌రే డిటెక్టర్‌ రెడీ అయింది. ఎక్స్‌రేలు తాకినప్పుడు ఈ డిటెక్టర్‌.. మానవ కణజాలంలా వ్యవహరించి రియాక్ట్ అవుతుంది. దీంతో రేడియోధార్మిక ప్రభావాన్ని అప్పటికప్పుడే కొలిచేందుకు వీలవుతుంది. దీనివల్ల రేడియోథెరపీ, మమోగ్రఫీ వంటి పరీక్షలు సురక్షితంగా నిర్వహించవచ్చు. ఈ ఎక్స్‌రే డిటెక్టర్‌ను విమానాశ్రయాల్లోని భద్రతా స్కానర్లలో, చారిత్రక కళాఖండాల స్కానింగ్‌‌కు కూడా వాడొచ్చు.

Also Read: Polls Today : ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో మొదలైన ఓట్ల పండుగ

కొవిడ్, క్యాన్సర్‌ను 3 నిమిషాల్లో గుర్తించే పరికరం

కొవిడ్-19, క్యాన్సర్‌ వ్యాధులను కేవలం 3 నిమిషాల్లో గుర్తించే ఒక పరికరాన్ని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాత్ ఇంజినీర్లు డెవలప్ చేశారు.  ఈ చిన్నపాటి పరికరంతో జన్యుపరీక్ష చేసి, క్యాన్సర్/కొవిడ్ ఉన్నాయో లేవో వెంటనే తెలుసుకోవచ్చట.  ముక్కు ద్వారా సేకరించే శాంపిల్‌ను ల్యాబ్ ఆన్ ఏ చిప్ సాంకేతికత ద్వారా తక్కువ ఖర్చుతో ఈ పరికరం ద్వారా పరీక్షించి కొవిడ్ ఉందో లేదో తేలుస్తారు. ఈ పరీక్ష ఫలితాన్ని స్మార్ట్ ఫోన్ యాప్‌లోనూ చూసుకోవచ్చు.

మౌత్‌వాష్ అతిగా వాడొద్దు

చాలామంది మౌత్ వాష్ వాడుతుంటారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. దంతాలను క్లీన్ చేయడమే కాకుండా దంతాల మధ్య ఉన్న మురికి, క్రిములను దూరం చేస్తుంది.అయితే మౌత్ వాష్‌ను అతిగా వాడడం మంచిది కాదని డాక్టర్స్ చెబుతున్నారు. మౌత్ వాష్ ఎక్కువగా వాడితే.. అందులో ఉండే కెమికల్స్ నోటి క్యాన్సర్‌‌కు దారితీసే రిస్క్ ఉంటుందని అంటున్నారు. తాజా అధ్యయన నివేదిక ప్రకారం.. మౌత్‌ వాష్‌లలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంది. ఆల్కహాల్ నుంచి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనేది క్యాన్సర్ కారకంగా పనిచేసే ముప్పు ఉంటుంది. 2016లో జరిపిన ఓ అధ్యయనం ప్రకారం మౌత్‌వాష్‌లను ఎక్కువగా వాడడం వల్ల నోటి క్యాన్సర్ మాత్రమే కాకుండా తల, మెడ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉందని(National Cancer Awareness Day) చెబుతున్నారు.