Site icon HashtagU Telugu

Stomach Pain: కడుపు నొప్పితో అల్లాడిపోతున్నారా.. అయితే వెంటనే ఈ చిట్కాలు పాటించండి!

Stomach Pain

Stomach Pain

మామూలుగా చాలామందికి తరచుగా కడుపునొప్పి వస్తూ ఉంటుంది. ఈ కడుపు నొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు కడుపునొప్పి తీవ్రమయ్యి ఆ నొప్పిని భరించలేక అల్లాడిపోతూ ఉంటారు. అలాంటప్పుడు టాబ్లెట్స్ వేసుకోవడం లేదంటే వాము వంటివి తినడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. కొద్దిసేపు రిలీఫ్ అనిపించినప్పటికీ మళ్ళీ నొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలో కడుపు నొప్పిని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వేసవికాలంలో నీళ్లు ఎక్కువగా తాగాలట. రోజుకి 10 గ్లాసుల నీళ్లు తాగడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. అలాగే వేసవిలో గంజి, సలాడ్ వంటివి తినడం మంచిదట. కారం, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. అదేవిధంగా వేసవిలో బాక్టీరియా, వైరస్‌ లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి శుభ్రమైన ఆహారం తినడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు. అదేవిధంగా వేసవిలో బయట ఆహారం తినకపోవడమే మంచిదట.

ఎందుకంటే వేడి వల్ల జీర్ణక్రియ బలహీనంగా ఉంటుందట. వేసవిలో కడుపు ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం ముఖ్యం అందుకోసం యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయడం మంచిది అని చెబుతున్నారు. అలాగే అజీర్తి, కడుపునొప్పి వికారం వంటి సమస్యలతో బాధపడేవారు స్పైసి ఫుడ్ జంక్ ఫుడ్స్ వంటి వాటికి దూరంగా ఉండాలట. అలాంటప్పుడు త్వరగా జీర్ణం అయ్యి ఆహారాలు మాత్రమే తీసుకోవాలని కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు..

Exit mobile version