Thyroid Disease: “థైరాయిడ్” వస్తే క్యాబేజీ, కాలీ ఫ్లవర్ తినొచ్చా..?

థైరాయిడ్ (Thyroid)వ్యాధిగ్రస్తులు పాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , గోధుమలను తినొచ్చా? తినొద్దా ? చాలామంది వీటిని పూర్తిగా దూరం పెడుతుంటారు. వాటిలో గొంతుకు సంబంధించిన గాయిటర్ వ్యాధికి కారణమయ్యే goitrogens ఉంటాయని భయపడుతుంటారు. అవి తింటే హైపో థైరాయిడిజం వస్తుందని ఆందోళన చెందుతుంటారు.

  • Written By:
  • Updated On - February 10, 2023 / 01:07 PM IST

థైరాయిడ్ (Thyroid)వ్యాధిగ్రస్తులు పాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , గోధుమలను తినొచ్చా? తినొద్దా ? చాలామంది వీటిని పూర్తిగా దూరం పెడుతుంటారు. వాటిలో గొంతుకు సంబంధించిన గాయిటర్ వ్యాధికి కారణమయ్యే goitrogens ఉంటాయని భయపడుతుంటారు. అవి తింటే హైపో థైరాయిడిజం వస్తుందని ఆందోళన చెందుతుంటారు. కానీ కొందరు వైద్య నిపుణులు అంత భయం అక్కర్లేదు అంటున్నారు. వంట వండే క్రమంలోనే పాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , గోధుమల్లోని goitrogens నశిస్తాయని చెబుతున్నారు. వాటిని తినడం మానేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. లిమిటెడ్ గా పాలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ , గోధుమలను తినొచ్చని సూచిస్తున్నారు. కాలీఫ్లవర్‌లో కాల్షియం, ఫాస్ఫరస్, కార్బోహైడ్రేట్స్, ఐరన్, ప్రొటీన్లు, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి ఉంటాయి. తీసుకునే ఆహారంలో అయోడిన్ లోపం ఉంటే హైపో థైరాయిడ్ సమస్య కలుగుతుందని గుర్తు చేస్తున్నారు.

■ థైరాయిడ్ అంటే

థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో గొంతు వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని విడుదల చేస్తుంది. ఈ హార్మోన్లు విడుదల చేయడం ద్వారా బాడీలో మెటబోలిక్ ప్రాసెస్‌ని అది ఎటాక్ చేస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నట్లయితే బాగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అలానే నీరసంగా కూడా ఉంటుంది. మల బద్ధకం, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రతను కోల్పోవడం, చర్మం పొడిబారి పోవడం ఇవి హైపో థైరాయిడిజం యొక్క లక్షణాలు. పిల్లల్లో అయితే ఎదుగుదల సరిగా ఉండదు. అలానే ప్యూబర్టీ ఆలస్యం అవడం వంటి లక్షణాలు కూడా మనం ఈ సమస్య ఉన్న వారిలో గమనించొచ్చు.

■ బరువు పెరగడానికి కారణం

మన శరీరం థైరాయిడ్ హార్మోన్లను కావాల్సినంత ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఈ హార్మోన్ మానవ శరీర పెరుగుదల, జీవక్రియలు మరియు అంతర్గత రోగనిరోధకతలో సైతం కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల, థైరాయిడ్ లోపం ఉన్నవారికి శరీరంలోని అదనపు బరువు తగ్గించుకోవడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సందర్భాల్లో, అంతర్లీన థైరాయిడ్ సమస్యలు కూడా దేహంలోని కొవ్వు పెరగడానికి తద్వారా శరీర బరువు వేగంగా పెరగడానికి కారణంగా మారతాయి. అందువల్ల, నిపుణులు సైతం బరువు తగ్గించుకోవాలనుకునే వారికి తరచుగా సలహా ఇచ్చేది థైరాయిడ్ గురించే.

■ ఈ ఫుడ్స్ కూడా బెస్ట్

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు పాలు, చీజ్‌, మాంసం, చేపలు, ఖర్జూరం, గుడ్డు తెల్ల సొన తినాలి. పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మునగాకుతో హైపోథైరాయిడిజం సమస్యను తగ్గించొచ్చు. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తినాలి. గ్లాసు నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలా కాచుకుని రోజూ తాగినా ఫలితం ఉంటుంది.

■ వైద్య పరీక్ష

థైరాయిడ్‌ స్టిమ్యులేటింగ్‌ హార్మోన్‌ (టీఎస్ఎహెచ్) పరీక్ష ద్వారా హైపోథైరాయిడిజం సమస్యను గుర్తించొచ్చు. రక్తంలో టీఎసెహెచ్ ఎక్కువ మోతాదులో ఉంటే.. హైపోథైరాయిడిజం ఉన్నట్టే.

■ గర్భిణులపై ప్రభావం

థైరాయిడ్‌ సమస్యతో బాధపడే గర్భిణులు జాగ్రత్త వహించాలి. థైరాక్సిన్‌ హార్మోన్‌ లోపిస్తే అబార్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. హైపో థైరాయిడిజంతో బాధపడే గర్భిణులు సరైన చికిత్స తీసుకోకపోతే బరువు పెరుగుతారు. రక్తపోటు పెరగడంతోపాటు ముందుగానే కాన్పు అయ్యే అవకాశమూ ఉంది.