Stress Relievers : మీరు విపరీతమైన ఒత్తిడితో బాధపడుతున్నారా..? అయితే ఇవి పాటించండి..ఒత్తిడి తగ్గుతుంది

ఇంట్లో సమస్యలు , చేసేపనిలో సమస్యలు, ఆరోగ్య సమస్య లు , పిల్లల సమస్య లు, ఉద్యోగ సమస్యలు అబ్బో ఇలా ఒకటేంటి ..చెప్పుకుంటూ పోతే ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిదీ సమస్యే..ఇలా ఎన్ని సమస్యలతో మనిషి తీవ్రమైన ఒత్తడికి గురవుతున్నాడు

Published By: HashtagU Telugu Desk
Stress

Stress

మనిషికి ఒత్తిడి (Stress ) అనేది ఇప్పుడు విపరితమైంది. ఉదయం లేచిన దగ్గరి నుండి పడుకునే వరకు అనేక సమస్యలతో ఒత్తిడికి గురిఅవుతున్నాడు. ఇంట్లో సమస్యలు , చేసేపనిలో సమస్యలు, ఆరోగ్య సమస్య లు , పిల్లల సమస్య లు, ఉద్యోగ సమస్యలు అబ్బో ఇలా ఒకటేంటి ..చెప్పుకుంటూ పోతే ప్రస్తుత ఉరుకులపరుగుల జీవితంలో ప్రతిదీ సమస్యే..ఇలా ఎన్ని సమస్యలతో మనిషి తీవ్రమైన ఒత్తడికి గురవుతున్నాడు. దీంతో మనిషి ఆందోళన, కుంగుబాటు, గుండెజబ్బులు, స్ట్రోక్‌ వంటి మానసిక, శారీరక సమస్యల బారినపడుతున్నాడు.ఈ క్రమంలో ఒత్తిడిని తగ్గించుకొని, సంతోషంగా ఎలా ఉండాలో ఆరోగ్య నిపుణులు పలు చిట్కాలు చెపుతున్నారు. ఇలా చేస్తే మీరు ఒత్తిడిని నుండి బయటపడి, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని అంటున్నారు.

ఒత్తిడిని నుండి బయటపడాలంటే ప్రతి రోజు వ్యాయామం చెయ్యాలి. ప్రశాంతంగా నిద్రపోవాలి. శ్వాస వ్యాయామాలు ప్రాక్టిస్‌ చెయ్యాలి. పోషకాహారం తీసుకోవాలి.ఇష్టమైనవారితో కాసేపైనా మాట్లాడాలి ఇలా ఇవి చేస్తే మనిషి ఒత్తిడి నుండి బయటపడతారు.

వ్యాయామం : ఒత్తిడి తగ్గాలంటే వ్యాయామం అనేది బాగా వర్క్ అవుట్ అవుతుంది. శారీరక దృఢత్వం, ఆరోగ్యం కోసం చేసే శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే.. ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఈ హార్మోన్‌ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. వ్యాయామం ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ వ్యాయామం చేస్తే.. శరీరం, మనస్సు విశ్రాంతి స్థితికి వెళ్తాయి..

నిద్ర కూడా ఒత్తిడి తగ్గించడంలో కీలక భాగం : ఒత్తిడిని కంట్రోల్‌లో ఉంచుకోవడానికి.. ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకపోతే.. మనకు చిరాకు, అలసట, ఆందోళనగా అనిపిస్తుంది. నిద్ర లేకపోవడం వల్ల కార్టిసాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. ఇది ఒత్తిడిని పెంచుతుంది, నిద్రలేమికి దారితీస్తుంది. రోజూ రాత్రి కనీసం 8 గంటలు నిద్రపోవాలి ఆలా పోతే మనం ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఒత్తిడి నుండి కూడా రిలాక్స్ అవుతాం.

We’re now on WhatsApp. Click to Join.

శ్వాస వ్యాయామాలు : శ్వాస వ్యాయామం చేయడం వల్ల మనిషి ఒత్తిడి నుండి బయటపడతారు. మీ శ్వాసపై దృష్టి పెడుతూ.. డీప్‌ బ్రీత్‌ ఎక్స్‌అర్‌సైజ్‌లు ప్రాక్టీస్‌ చేస్తే.. మీ మనస్సుకు విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. రోజుకు 10 నిమిషాలు డీప్‌ బ్రీథ్‌ ఎక్స్‌అర్‌సైజ్‌‌లు ప్రాక్టిస్‌ చేస్తే.. ఒత్తిడి తగ్గుతుంది.

పోషకాహారం : పోషకాహారం కూడా ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ ఆహార అలవాట్లలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్ వంటి వివిధ రకాల సంపూర్ణ ఆహారాలను తీసుకుంటూ.. ప్రాసెస్‌ చేసిన ఫుడ్స్‌, చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటె ఒత్తిడి తగ్గుతుంది.

ఇష్టమైన వారితో మాట్లాడడం : మీకు ఇష్టమైన వారితో కాసేపు మాట్లాడిన ఒత్తిడి తగ్గుతుంది. చాలామంది చాల విషయాలు అందరికి చెప్పుకోలేక ఒత్తడికి గురి అవుతుంటారు. అలాంటప్పుడు మనకు ఎంతో ఇష్టమైన వాటితో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడితే ఒత్తిడి అనేది తగ్గుతుంది. ఇలా ఇవి పాటిస్తే మీరు ఒత్తిడి నుండి కాస్తయినా బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.

Read Also : Energy Foods: మీరు బలహీనంగా ఉన్నారా.. అయితే శరీరానికి తక్షణ శక్తినిచ్చేవి ఇవే..!

  Last Updated: 10 Oct 2023, 04:29 PM IST