Monsoon Hair Care: వర్షాకాలంలో అధిక తేమ కారణంగా వెంట్రుకలపై దుమ్ము అలానే ఉంటుంది. దీని వల్ల వెంట్రుకల కుదుళ్లు బలహీనపడి జుట్టు తంతువులు పూతగా మారుతాయి. వర్షాకాలంలో జుట్టు రాలడానికి ఇదే ప్రధాన కారణం. అలాగే జుట్టు మూలాల దగ్గర బ్యాక్టీరియా చేరడం ద్వారా దురద, వెంట్రుకలు రాలిపోవడం జరుగుతుంది. ఇవి మీ చుండ్రు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయి. వర్షపు నీటి ఆమ్లత్వం కూడా అధిక జుట్టు రాలడానికి కారణం.
మురికిని తొలగించడానికి మీ జుట్టును తేలికపాటి షాంపూతో క్రమం తప్పకుండా కడగాలి. ఇది చుండ్రు మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. హెయిర్ ప్రొడక్ట్స్ అధికంగా వాడకుండా ఉండండి: జెల్లు మరియు స్ప్రేలు వంటి హెవీ స్టైలింగ్ ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించండి. సరైన దువ్వెన ఉపయోగించండి: జుట్టును సులభంగా విడదీయడానికి మంచి దువ్వెనను ఎంచుకోండి. దువ్వెన దంతాల మధ్య తగినంత ఖాళీ ఉండేలా చూసుకోండి, తద్వారా దువ్వెన సమయంలో జుట్టు విరిగిపోదు. తడి జుట్టు విరిగిపోయే అవకాశం ఉన్నందున వెంటనే దువ్వడం చేయకండి. గుర్తుంచుకోవలసిన మరొక జుట్టు సంరక్షణ చిట్కా ఏమిటంటే. ఇతరుల దువ్వెనలను వాడుకోకపోవడం ఉత్తమం.
ఆరోగ్యవంతమైన జుట్టును కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు తినే ఆహారం మీ జుట్టు నాణ్యతను నిర్ణయిస్తుంది. గుడ్లు, వాల్‌నట్‌లు, పాల ఉత్పత్తులు మరియు తృణధాన్యాలు వంటి ప్రోటీన్-రిచ్ ఫుడ్‌లను మీ రెగ్యులర్ డైట్‌లోచేర్చుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు మీ జుట్టుకు మెరుపును ఇస్తుంది. ఇక మీరు చుండ్రు లేదా సెబోరియాతో బాధపడుతుంటే, కెటోకానజోల్, సాలిసిలిక్ యాసిడ్ లేదా జింక్ పైరిథియోన్ ఉన్న షాంపూని వాడండి. మీ స్కాల్ప్ ఎక్కువగా జిడ్డుగా ఉన్నట్లయితే దానిని తరచుగా కడగాలి.
ఆయిల్ స్కాల్ప్ ఉంటే వర్షాకాలంలో నూనె రాసుకోవడం మానుకోండి. మీరు వర్షాకాలంలో జుట్టును పూర్తిగా ఆరబెట్టండి. ఆరోగ్యకరమైన మరియు మెరిసే జుట్టు కోసం వర్షాకాలంలో మీ శిరోజాలను రక్షించుకోవడం చాలా అవసరం. ఈ చిట్కాలను అనుసరిస్తే సరైన జుట్టు మీ సొంతం అవుతుంది.
Also Read: Silk Sarees Caring: పట్టు చీరలను కాపాడుకోవడం ఎలా?