Site icon HashtagU Telugu

Health Tips: ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల కళ్ళు మంటగా అనిపిస్తున్నాయా.. అయితే వెంటనే ఇలా చేయండి!

Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ల ఉపయోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించకుండా రోజు కూడా గడవదు. లాప్టాప్ లు మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు స్మార్ట్ టీవీలు ఇలా చాలా రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని ఉపయోగించడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా ఉపయోగిస్తే మాత్రం అనేక రకాల సమస్యలు వస్తాయి అని తెలిసిన కూడా చాలామంది వీటిని ఎక్కువగానే వినియోగిస్తూ ఉంటారు.

కొందరు ఈ గాడ్జెట్స్ ని సరదాల కోసం ఉపయోగిస్తే కొందరు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఉపయోగిస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఆ ఒత్తిడి కళ్ళ మీద పడుతుంది. ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వల్ల ఎక్కువగా నష్టపోయేవి కళ్ళు మాత్రమే అని చెప్పాలి. దీనివలన మనం అనేక సమస్యలని ఎదుర్కోవలసి వస్తుంది. కళ్ళు దురద పెట్టడం, కళ్ళు డ్రై అయిపోవడం, కంటి నొప్పి, కంటి నుంచి నీరు కారడం, కళ్ళు మసకబారడం వంటి సమస్యలు ఎక్కువగా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ వాడటం వల్లే వస్తుంది.

అలా అని వాటిని పూర్తిగా పక్కన పెట్టలేని పరిస్థితి. అందుకే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు అంటున్నారు.అయితే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ఉపయోగించే ముందు మీ కళ్ళకి ఎదురుగా ఉండే ఎత్తులో గాడ్జెట్ పెట్టుకొని వాడటం వల్ల కంటికి ఒత్తిడి ఎక్కువగా ఉండదు. అలాగే ప్రతి గంటకి ఒక ఐదు నిమిషాల పాటు కంప్యూటర్ ముందు నుంచి లేచి చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతిని చూస్తూ ఉండాలి. అది కంటికి రిలాక్సేషన్ ని ఇస్తుంది. అలాగే కంటికి ఒత్తిడిగా అనిపించినప్పుడు కంటిమీద కీర లేదా బంగాళదుంప స్లైసెస్ పెట్టుకొని కాస్త రిలాక్స్ అవ్వడం మంచిది.

అది కంటికి మంచి విశ్రాంతిని ఇస్తుంది. అలాగే ఒంటికి వ్యాయామం ఎంత అవసరమో కంటికి కూడా వ్యాయామం అంతే అవసరం అని చెబుతున్నారు. ఐ బాల్ ని ఒక్క దగ్గరే నిలబెట్టకుండా చుట్టూ చూడటం, ఐ బాల్ ని గుండ్రంగా తిప్పడం, కంటి ఎదురుగా పెన్సిల్ పెట్టుకొని కాన్సన్ట్రేట్ చేసి చూడటం వంటివి కంటికి మంచి ఎక్సర్సైజ్. దీనితో పాటు మంచినీరు కూడా ఎక్కువగా త్రాగుతూ ఉంటే కంటి ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందవచ్చట. ఇక ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉపయోగించాలి అనుకున్న వారు నిపుణుల సలహా మేరకు కళ్లద్దాలను ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు.