చలికాలం మొదలైంది అంటే చాలు దగ్గు, జలుబు సమస్య మొదలవుతూ ఉంటాయి. ఈ దగ్గు జలుబు సమస్యను తగ్గించుకోవడానికి చాలామంది మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎన్ని మెడిసిన్స్ ఉపయోగించినా ఇవి కొన్ని వారాలపాటు అలాగే వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు రాత్రి సమయంలో నిద్ర పోవడానికి కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముక్కుదిబ్బడ కారణంగా సరిగా ఊపిరి పీల్చుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది. అయితే అలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే ఈ దగ్గు జలుబు తుమ్ములు వంటి సమస్య నుంచి బయటపడవచ్చట. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
జలుబు నుంచి ఉపశమనం పొందడానికి ఆవిరి పట్టడం ప్రభావవంతంగా ఉంటుంది. ఇది ముక్కు కారడాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఆవిరిపట్టేటప్పుడు ముక్కుతో నెమ్మదిగా శ్వాస తీసుకోవాలి. ఇది జలుబు నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. రాత్రి నిద్రపోయే ముందు ఆవిరి పట్టుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగే అల్లం, తులసి కలిపిన నీటిని తాగడం వల్ల దగ్గు, జలుబు నుంచి బయటపడవచ్చట. అలాగే మీ రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. టీ లో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే జలుబు, గొంతునొప్పి తగ్గుతాయి. దగ్గుకు తేనె చాలా రెమిడి అని చెబుతున్నారు.
అదేవిధంగా తులసి ఆకులు, నల్ల మిరియాలతో చక్కటి కాఫీని తయారు చేయాలి. ఈ టీని వేడిగానే తాగాలి. ఈ టీ మీ దగ్గును, జలుబును ఇట్టే తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే మీకు జలుబు ఉన్నప్పుడు మీ ఆహారంలో అదనపు వెల్లుల్లిని చేర్చండి. ఇది జలుబు లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందట. మరిగించిన పాలను వేడి చేసే ముందు అందులో కొద్దిగా మిరియాల పొడిని కలుపుకొని తాగడం వల్ల ఈ పాలు జలుబును తొందరగా తగ్గించడానికి సహాయపడతాయి. తులసి ఆకులు, కలకందలను మిక్స్ చేసి మిక్స్ డ్ గా తింటే జలుబు నుంచి తొందరగా బయటపడవచ్చట. పాలలో పసుపు వేసి తాగడం చాలా మంచిది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది.