చాలామంది బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదని బాధపడుతూ ఉంటారు. ఇక బరువు తగ్గే సమయంలో చాలామంది చికెన్ మటన్ వంటివి తినకూడదని వాటిని పూర్తిగా మానేయాలని చెబుతూ ఉంటారు. కానీ అది అంత సులువైన విషయం కాదనే చెప్పాలి. అయితే చికెన్ మటన్ లలో ఒకటి బరువు తగ్గడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ రెండింటిలో ఏది బరువును తగ్గిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 100 గ్రాముల చికెన్ లో 3.12 కొవ్వు, 24.11 గ్రాముల ప్రోటీన్, 140 కేలరీలు ఉంటాయి. అందేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుము, వంటి ఎన్నో రకాల పోషకాలు కూడా ఉంటాయి.
ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు. అలాగే 100 గ్రాముల మటన్ లో 3.5 గ్రాముల కొవ్వు, 57 మిల్లీ గ్రాముల సోడియం, 26 గ్రాముల ప్రోటీన్, 143 కేలరీ లు ఉంటాయి. అలాగే విటమిన్ బి12, జింక్, ఐరన్ వంటి పోషకాలు మటన్ లో మెండుగా ఉంటాయి. ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో బరువు తగ్గడానికి ఏది మంచిది అన్న విషయానికి వస్తే.. చికెన్ లో కంటే మటన్ లోనే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి చికెన్ సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అవుతున్న వారు మటన్ కాకుండా చికెన్ నే తినాలని చెబుతున్నారు. అయితే మటన్ లో చికెన్ కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.
కానీ చికెన్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి మటన్ కంటే చికెన్ బెటర్. బరువు తగ్గాలనుకునే వారు చికెన్ ను ఎన్నో విధాలుగా తినవచ్చు. బరువు తగ్గాలనుకుంటే చికెన్ రోల్స్, చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్ ను తినవచ్చు. పెరుగు చికెన్ ను మీ ఆహారంలో చేర్చుకున్నా బరువు తగ్గుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే వారానికి రెండు సార్లు 100 గ్రాముల చికెన్ తినవచ్చని నిపుణులు చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.