Health -Tips : పళ్ళు పచ్చగా ఉన్నాయా..నలుగురిలో నవ్వలేకపోతున్నారా…ఈ చిట్కాలు ట్రై చేయండి.!!

నలుగురిలో మాట్లాడాలన్నా..నవ్వాలన్నా...పళ్లు బయటపడతాయి. నవ్వి పలకరించాలంటే...కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కారణం వాళ్ల పళ్ళు పచ్చగా ఉండటమే.

  • Written By:
  • Publish Date - July 2, 2022 / 01:13 PM IST

నలుగురిలో మాట్లాడాలన్నా..నవ్వాలన్నా…పళ్లు బయటపడతాయి. నవ్వి పలకరించాలంటే…కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. కారణం వాళ్ల పళ్ళు పచ్చగా ఉండటమే. పళ్ళు తెల్లగా ఉంటేనే ముఖానికి అందం. పళ్ళ ఆరోగ్యం అందానికే కాదు…మన శరీరంలో ఉండే జబ్బులకు కూడా ముడిపడి ఉంది. పళ్ళు పచ్చగా ఉండటానికి కారణం పళ్ళపై ఉండే ఎనామిల్ దెబ్బతినడం. ఆహారంలో చక్కెరలను ఎక్కువగా తీసుకోవడం, ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్న నీరు త్రాగడం, ఎక్కువ రసాయనాలు కలిగిన టూత్ పేస్టులు వాడటం వల్ల ఇవి పళ్ళపై గట్టిగా ఉండే ఎనామిల్ దెబ్బతీసి పళ్ళను పచ్చగా మారుస్తాయి.

ఇలా పళ్ళు పచ్చగా ఉన్నవాళ్లు అందంగా, ఆరోగ్యంగా మార్చుకునేందుకు వేలు ఖర్చు పెడుతుంటారు. కానీ అవన్నీ మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడమే కాదు దుష్పఫలితాలను కలిగిస్తుంటాయి. దీనికోసం కొన్ని చిట్కాలను పాటిస్తే…మిలమిలా మెరిసే పళ్ళఉ సొంతం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం.

1. తక్కువ ఖర్చులో ఇంటి చిట్కాలను పాటించినట్లయితే మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో బేకింగ్ సోడా, రెండు చుక్కల బాదాం ఆయిల్, ఒక స్పూన్ ఆరెంజ్ జ్యూస్ వేసి మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని పొద్దున బ్రష్ చేసుకునే సమయంలో టూత్ పేస్టు బదులుగా రెండు లేదా మూడు నిమిషాలు బ్రష్ చేసుకోవాలి. ఇలా మూడురోజుల పాటు బ్రష్ చేస్తే ఎంతటి గారపట్టిన పసుపు పళ్ళు అయినా సరే ముత్యాల్లాగా మెరిసిపోవాల్సిందే.

2. బొగ్గుపొడితో పళ్ళను వారానికి ఒకసారి శుభ్రం చేసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ టీ, కాఫీలు త్రాగడం వల్ల కలిగే కావటిస్ నీ, గారను కూడా తొలగిస్తుంది.
3. ఇంట్లో వాడే పాలపొడిని రెండు మూడు రోజులకోకొసారి టూత్ పేస్ట్ పైవేసి పళ్ళను బ్రష్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉండే కాల్షియం, పాస్పరస్, ఫ్లోరిన్ వల్ల కలిగే గారను ఈజీగా తొలగించుకవచ్చు.

4. పళ్ళను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఆహారం తీసుకోగానే నీటిని నోట్లో వేసుకుని తప్పక పుక్కలించాలి. ఉదయం, రాత్రిపూట తప్పక బ్రష్ చేయాలి. ఇలా చేస్తే 90శాతం కావటిస్ రాకుండా పళ్ళను కాపాడుకోవచ్చు.