Site icon HashtagU Telugu

Eye Care Tips: కళ్లకు అద్దాలు రాకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

Eye Care Tips

Eye Care Tips

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్,టీవీ, ల్యాప్ టాప్, ట్యాబ్, కంప్యూటర్ ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. రోజుల్లో చాలామంది గంటల తరబడి మొబైల్ ఫోన్లో ముందు టీవీల ముందు గడపడం వల్ల చిన్న వయసులోనే కళ్ళద్దాలు వస్తున్నాయి. ఇదివరకు రోజుల్లో కేవలం వయసు మీద పడిన వారికి మాత్రమే కళ్లద్దాలు వచ్చేవి. కానీ ప్రస్తుతం రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఈ ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ వల్ల చిన్న పిల్లలకు కళ్లద్దాలు వస్తున్నాయి. అయితే కళ్లద్దాలు రాకుండా ఉండాలి అంటే కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం వల్ల కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతిరోజు ఒక పది నిమిషాల పాటు కళ్ళ కోసం సమయాన్నీ కేటాయించి వ్యాయామం చేయడం వల్ల కంటి సమస్యలు రావు. ఇందుకోసం రిలాక్స్ గా ఒకచోట కూర్చుని రెండు కళ్ళను పెద్దవిగా చేసి తల కదిలించకుండా కనుగొడ్లు మాత్రమే కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి, పై నుంచి కిందకు, కింద నుంచి పైకి మెల్లగా తిప్పుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు 10 నుంచి 20 సార్లు చేయడం వల్ల కంటిలోని రక్త కణాలు యాక్టివ్ అయ్యి కంటి లోని రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 సెకండ్ల పాటు విరామం తీసుకుని ఆ సమయంలో 20 మీటర్ల దూరంలో ఉన్న ఒక వస్తువుపై మీ దృష్టిని పెట్టాలి.

గంటకు ఐదు నిమిషాల పాటు మీ కళ్ళకు తగినంత విశ్రాంతి ఇవ్వాలి. విశ్రాంతి తీసుకొనే సమయంలో కళ్లను సవ్య, అపసవ్య దిశల్లో గుండ్రంగా తిప్పాలి. లేదంటే కళ్లను మూసి ఉంచాలి. అలాగే ప్రతీరోజూ బ్లూ లైట్‌ని ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కంప్యూటర్‌ విజన్‌ సిండ్రోమ్‌, డిజిటల్‌ ఐ స్ట్రైన్ సమస్యలకు దారితీస్తుంది. కంప్యూటర్‌, టీవీ, ల్యాప్‌టాప్‌, సెల్‌ఫొన్స్‌ వంటి డిజిటల్‌ పరికరాలు వాడేసమయంలో కచ్చితంగా యాంటీ రిఫ్లెక్టివ్ కోటింగ్ అద్దాలు ఉపయోగించాలి. అలాగే మీరు తినే ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. క్యారెట్‌, ఆకుకూరల్లో ఈ విటమిన్‌ ఎ పుష్కలంగా లభిస్తుంది. ఆకుకూరలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటితో పాటుగా వాల్‌నట్స్‌, బాదం, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, అవకాడోలను రెగ్యులర్‌గా తీసుకోవాలి. ప్రతి రోజూ 8 నుంచి 10 గ్లాసుల వాటర్‌ తాగాలి. అప్పుడే మన శరీరంలో కావలసినంత తేమ ఉంటుంది. దీనివల్ల కళ్లు కూడా పొడిబారకుండా ఉంటాయి.