ప్రస్తుత రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కొందరికి ఎటువంటి ఆహారం తినాలి ఎటువంటి ఆహారం తినకూడదు అన్న విషయాలు తెలియవు. మరి తయారైన సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ సమస్య ఉన్నవారు కార్బోహైడ్రేట్లు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలట.
లేదంటే థైరాయిడ్ గ్రంథి నియంత్రణలో ఉండదట. అలాగే విపరీతంగా బరువు పెరిగిపోతారట. ఈ రెండు సమస్యలు రాకూడదంటే ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. అలాగే కుకీస్ కేకులు బంగాళదుంప చిప్స్ వంటి వాటికి థైరాయిడ్ పేషెంట్లు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలట. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఖనిజాలు, ఉప్పు ఉంటుందని కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిదని చెబుతున్నారు. ఇకపోతే తినాల్సిన ఆహార పదార్థాల విషయానికి వస్తే.. థైరాయిడ్ పేషెంట్లు తీసుకోవాల్సిన వాటిలో నిమ్మకాయ నీరు కూడా ఒకటి. విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే లెమన్ వాటర్ థైరాయిడ్ హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుందట.
ఈ వాటర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారం జీర్ణక్రియను నియంత్రించడానికి సహాయపడుతుందట. అదేవిధంగా శరీరంలోని ఈ విషయాన్ని కూడా తొలగిస్తుందని చెబుతున్నారు. బ్రెజిల్ గింజలు, సార్డినెస్ చేపలు, గుడ్లు, చిక్కుళ్లు వంటి సెలీనియం ఎక్కువగా ఉండే ఆహారాలను కూడా తినాలని చెబుతున్నారు. అలాగే క్యారెట్ జ్యూస్ థైరాయిడ్ ను నియంత్రించడానికి సహాయపడుతుందట. యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఎక్కవుగా ఉండే క్యారెట్ జ్యూస్ ను తాగడం వల్ల థైరాయిడ్ కు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.