Thyroid: థైరాయిడ్.. శరీరంలో హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్ కారణంగా వచ్చే వ్యాధి ఇది. థైరాయిడ్ ఫలానా వయసు వారికే వస్తుందని, ఫలానా వ్యక్తులకే వస్తుందనేం లేదు. పిల్లల నుంచి పెద్దల వరకూ.. బక్కగా ఉన్నోళ్ల నుంచి లావుగా ఉన్నవారి వరకూ ఎవరికైనా వస్తుంది. థైరాయిడ్ బాధితులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. ఇందులో రెండు రకాల థైరాయిడ్స్ ఉన్నాయి. హైపో, హైపర్. థైరాయిడ్ వల్ల లావుగా అవుతారు.. అలాగే బక్కగా కూడా అవుతారు. థైరాయిడ్ ఉన్నవారు ఖచ్చితమైన డైట్ ను పాటించాలని నిపుణులు చెబుతుంటారు. మరి థైరాయిడ్ ఉన్నవారు అన్నం తినొచ్చా ? తినకూడదా ? తింటే ఏమవుతుంది ? దీని గురించి నిపుణులు ఏం చెప్పారో తెలుసుకుందాం.
అన్నంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని, షుగర్ స్థాయిలు పెరుగుతాయని చెబుతుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు అన్నం అస్సలు తినకూడదు. వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైస్ తినాలి. ఎందుకంటే.. బియ్యంలో ఉండే గ్లూటెన్ అనేది థైరాయిడ్ కు హానికరం. ఇది శరీరంలోని యాంటీ బాడీలను తగ్గించే ప్రొటీన్. థైరాక్సిన్ హార్మోన్ తో సమస్యలను కలిగిస్తుంది.
అంతేకాదు.. బియ్యంలో కార్బోహైడ్రేట్లు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అన్నం తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్, థైరాయిడ్, టైప్ 2 డయాబెటీస్ తో పాటు.. స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. థైరాయిడ్ ఉన్నవారు అన్నం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారట. రోటీలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు బియ్యంలో తక్కువగా ఉంటాయి. అలాగే సూక్ష్మపోషకాలు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి థైరాయిడ్ వ్యాధిగ్రస్తులు వీలైనంత వరకూ వైట్ రైస్ కు దూరంగా ఉండాలి. ఒకవేళ తినాలనుకుంటే మాత్రం అన్నంలో కూర ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా తింటే ప్రొటీన్ ఎక్కువగా అందుతుంది.