Site icon HashtagU Telugu

‎Thyroid Pain: థైరాయిడ్ వల్ల మెడ, కండరాల నొప్పులు వస్తాయా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Thyroid Pain

Thyroid Pain

‎Thyroid Pain: థైరాయిడ్.. ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఈ సమస్య వచ్చిన వారు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కోంటూ ఉంటారు. వాటిలో ఇప్పుడు మనం తెలుసుకోబోయేవి కూడా ఒకటి. థైరాయిడ్ శరీర జీవక్రియ, హార్మోన్లు, అనేక ముఖ్యమైన విధులను నియంత్రిస్తుందట. ఈ గ్రంథి అవసరమైన దానికంటే ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి, బలహీనత, వాపు వంటి సమస్యలు ప్రారంభమవుతాయట. కాగా థైరాయిడ్ సంబంధిత నొప్పి చాలాసార్లు నెమ్మదిగా పెరుగుతుందట.

‎కొన్ని సందర్భాల్లో గ్రంథిలో వాపు వస్తుందట. దీనివల్ల మెడ లేదా గొంతులో సున్నితత్వం, నొప్పి కలుగుతుందట. ఈ నొప్పి దవడ లేదా చెవి వరకు కూడా వ్యాపించవచ్చని, థైరాయిడిటిస్ వంటి పరిస్థితులు లేదా గొంతులో గొయిటర్ కూడా అసౌకర్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు. థైరాయిడ్ కండరాలు, కీళ్లలో కూడా నొప్పిని కలిగిస్తుందట. హార్మోన్ స్థాయిలు తగ్గినప్పుడు, కండరాలు బలహీనంగా, బిగుతుగా, నొప్పిగా అనిపిస్తాయట. ముఖ్యంగా భుజాలలో ఇబ్బందిగా ఉంటుందని, అదే సమయంలో హైపర్ థైరాయిడిజంలో, చేతులు, కాళ్ళలో తిమ్మిరి లేదా అలసట అనిపించవచ్చని చెబుతున్నారు.

‎కొన్నిసార్లు థైరాయిడ్ సమస్య కారణంగా కీళ్లు బిగుసుకుపోతాయట. వాపు కూడా వస్తుందట. హైపోథైరాయిడిజంలో ఈ నొప్పి ఆర్థరైటిస్ వంటి లక్షణాలను కలిగిస్తుందట. దీనిలో కీళ్లలో బిగుసుకుపోవడం, సున్నితత్వం ఉంటుందట. ఈ లక్షణాలు వేరే వాటివల్ల అనుకుంటారు. అందుకే చికిత్స ఆలస్యమై ఇబ్బందులు పెరుగుతాయని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో నొప్పి శరీరంలోని అసాధారణ భాగాలలో కూడా కనిపిస్తుందట. వీపు, భుజాలు లేదా ఛాతీలో నొప్పి వస్తుందని, ఛాతీ నొప్పి అనేది తీవ్రమైన లక్షణం. వైద్యుడిని సంప్రదించడం అవసరం అయినప్పటికీ థైరాయిడ్ ఇతర లక్షణాలు కూడా ఉంటే ఇది గ్రంథితో సంబంధం ఉన్న సంకేతం కావచ్చని చెబుతున్నారు నిపుణులు. థైరాయిడ్ సంబంధిత నొప్పిని తగ్గించడానికి కేవలం మందులే కాకుండా సరైన జీవనశైలి, ఫిజికల్ థెరపీ, నొప్పి నిర్వహణ అవసరమట. సకాలంలో చికిత్స చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా జీవిత నాణ్యత కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

Exit mobile version