Site icon HashtagU Telugu

Throat Pain : గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు వాడండి..

Throat Pain Reduce with Home Tips Follow These Tips

Throat Pain Reduce with Home Tips Follow These Tips

ప్రస్తుతం మనం ఉంటున్న వాతావరణం అనేది ఒక రోజు ఎండ ఇంకొక రోజు వాన ఉంటుంది. ఈ విధంగా తొందరగా వాతావరణం మారడం వలన మనకు జలుబు(Cold), దగ్గు(Cough), జ్వరం(Fever), గొంతు నొప్పి(Throat Pain) వంటివి వస్తాయి. గొంతు నొప్పి వచ్చినట్లైతే మనకు మాట్లాడడం, తినడం, తాగడం వంటివి చేయడం ఇబ్బందిగా ఉంటుంది. గొంతు నొప్పిని తగ్గించుకోవడానికి మనం కొన్ని ఇంటి చిట్కాలను(Home Tips) వాడి తగ్గించొచ్చు.

* గోరువెచ్చని నీటిలో పసుపు, ఉప్పు కలుపుకొని ఆ నీటితో ఉదయాన్నే గొంతులో పోసుకొని పుక్కిలించి పారబోయాలి. ఇలా చేయడం వలన గొంతు నొప్పి, జలుబు, దగ్గు తగ్గుతాయి.
* మంచి తేనెను రోజుకు రెండు సార్లు ఒక స్పూన్ వంతు తినడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది.
* ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ లో ఒక స్పూన్ తేనె కలిపి కప్పు వేడి నీటిలో కలపాలి. దానిని వేడివేడిగా తాగాలి. ఇలా చేయడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది.
* వెల్లుల్లిని తీసుకొని తినడం వలన అది గొంతు నొప్పిని, దగ్గును తగ్గిస్తుంది. వంటల్లో కూడా వెల్లుల్లిని చేరిస్తే గొంతునొప్పి, జాలుపు తగ్గుతుంది.
* ఒక కప్పు వేడి నీటిలో అర స్పూన్ కేయాన్ పెప్పర్, ఒక స్పూన్ తేనె ను కలుపుకొని తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
* లికోరైస్ రూట్ టీ తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. లికోరైస్ రూట్ లో యాంటి వైరల్, యాంటి ఇన్ఫలమేటరీ లక్షణాలు ఉన్నాయి. కావున గొంతు నొప్పి తగ్గుతుంది.
* హెర్బల్ టీ, ఆరెంజ్ జ్యూస్ తాగడం వలన గొంతు నొప్పి తగ్గడానికి అవకాశం ఉంది.
* దాన్నిమ్మ జ్యూస్ ను రోజుకు రెండు సార్లు తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది.
* కొద్దిగా అల్లాన్ని తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి ఆ నీటిని మరిగించాలి ఆ నీటిని తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది.
* తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో పుక్కలించడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. ఇలా ఇంటి చిట్కాలని వాడి గొంతు నొప్పి తగ్గించుకోవచ్చు.

 

Also Read : Onion – Garlic : పండుగలు, పూజల టైంలో ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినరు ?