చాలామంది సీజన్ తో సంబంధం లేకుండా గొంతు నొప్పి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా జలుబు, దగ్గు సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా మందిని ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి. గొంతు నొప్పి కారణంగా ఆహారం తినాలి అన్న నీరు తాగాలి అన్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే గొంతు నొప్పి రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మరి ఈ గొంతు నొప్పి నుంచి ఉపశమనం పొందాలి అంటే తప్పనిసరిగా కొన్ని చిట్కాలు పాటించాల్సిందే అంటున్నారు వైద్యులు.
మరి గొంతు నొప్పి నుంచి బయట పడాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. భారతీయ కిచెన్ లో దొరికే మసాలా దినుసులలో లవంగం కూడా ఒకటి. లవంగం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లవంగంలో ఉండే యాంటీ మైక్రోబియల్ యాంటీ వైరల్ యాంటీసెప్టిక్ గుణాలు మెరుగైన ఆరోగ్యాన్ని అందిస్తాయట. గొంతు నొప్పితో బాధపడే వారికి లవంగం టీ ఎంతో బాగా పనిచేస్తుంది. గొంతు నొప్పి ఉన్నవారు తరచూ లవంగం టీ తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా తాగడం వల్ల జలుబు, దగ్గు, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చట.
అలాగే కడుపులో వికారంగా అనిపించడం వాంతులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయట. మరి ఈ లవంగం టీ ని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. లవంగం టీ తయారీకు 3 లవంగాలు, ఒక కప్పు నీరు చాలు. ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకుని అందులో 3 లవంగాలు వేసి బాగా మరిగించాలి. 3-5 నిమిషాలు మరిగించిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని వడపోసి రుచి కోసం తేనె కొద్గిగా కలుపుకుని తాగవచ్చు. ఇలా రోజు తాగడం వల్ల పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు. పసుపు వల్ల కూడా ఎన్నో రకాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే.
పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుంది. అయితే గొంతు నొప్పితో బాధ పడేవారు పడుకునే ముందు పసుపు పాలు తాగవచ్చు. మీరు ఒక కప్పు పాలలో చిటెకెడు పసుపు కలపాలి. కొద్దిగా నల్ల మిరియాల పొడి కూడా కలపడం వల్ల ఇంకా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. అరటీస్పూన్ దాల్చిన చెక్క పొడి లేదా చిన్న దాల్చిన చెక్కను 250 ml నీటిలో 5 నిమిషాలు బాగా మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి చల్లారనివ్వాలి. గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది.
note: ఈ సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. కాబట్టి ఎటువంటి సందేహాలు ఉన్నా వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.