Winter: చలికాలం ఈ పనులు అసలు చేయకండి..చేస్తే అవి మీ ప్రాణానికే ప్రమాదం?

చలికాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం విషయంలో అందం విషయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

  • Written By:
  • Publish Date - November 13, 2022 / 09:10 AM IST

చలికాలం మొదలైంది. చలికాలంలో ఆరోగ్యం విషయంలో అందం విషయంలో అనేక రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే చలికాలంలో మనం ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు వ్యాధులు చుట్టూ ముడుతూ ఉంటాయి. ఇందుకు గల ప్రధాన కారణం వాతావరణంలోని మార్పులు, చల్లని గాలులు. చలికాలంలో దగ్గు,జలుబు లాంటి సమస్యలు వస్తాయి. వీటితో పాటుగా చలికాలంలో గుండెపోటు లాంటి ప్రమాదకరమైన సమస్యలు కూడా వస్తాయి. పలు అధ్యయనాల్లో చలికాలంలో గుండెపోటు వచ్చే రేటు చాలారెట్లు పెరుగుతుంది.

కాబట్టి గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉన్న వారు చలి కాలంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు లేదా ఊబకాయం, అధిక రక్తపోటు ఉన్నవారికి గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా చలికాలంలో రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల ఒత్తిడి పెరిగి రక్తపోటు కూడా పెరగడం మొదలై క్రమంగా బీపీ పెరిగే కొద్దీ గుండెపోటు కేసులు వెలుగులోకి రావడం మొదలవుతుంది. అలాగే చల్లని వాతావరణంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది.

కాబట్టి దీని కారణంగా శరీర ఉష్ణోగ్రతను సమం చేస్తున్నప్పుడు శరీరంలో రక్తపోటు పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. గుండె ఆరోగ్యాన్ని ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఉదయం చలికాలంలో ఉదయం 6 నుండి 7 గంటల మధ్య నడకకు వెళ్లవద్దు. ఉదయం 9 గంటల తర్వాత నడకకు వెళ్లండి.ఉప్పు తక్కువగా తినాలి. ఎక్కువ సేపు ఎండలో గడపాలి. రోజూ కొంతసేపు వ్యాయామం చేయాలి. వెచ్చగా ఉండే దుస్తులు ధరించడం శీతాకాలంలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం చాలా ముఖ్యం.
రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం ముఖ్యం. అధిక బీపీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.