Site icon HashtagU Telugu

Calotropis Procera: మన ఇంటి పరిసరాల్లో ఉండే ఈ మొక్క ముసలితనాన్ని పోగొడుతుందని మీకు తెలుసా?

Mixcollage 01 Dec 2023 07 21 Pm 9219

Mixcollage 01 Dec 2023 07 21 Pm 9219

ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలను అందించింది. అయితే అందులో కొన్నింటిని మనం ఉపయోగిస్తే మరికొన్నింటిని ఉపయోగించము. వాటితో కలిగే ఉపయోగాలు తెలియక మనం వాటిని పట్టించుకోం. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ మొక్క మన ఇంటి పరిసరాల్లో ఎక్కడ చూసినా కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మన ఊళ్లో రోడ్ల పక్కన, తుప్పల్లో బోలెడు పెరుగుతూ ఉంటాయి. ఈ మొక్కల మొగ్గలను నొక్కితే, టప్ మని శబ్దం వస్తుంది. మొగ్గల లోపల ఉడుత ఆకారంలో విత్తనాలు ఉంటాయి. ఆ మొక్క మరేదో కాదు జిల్లేడు మొక్క. దీని సైంటిఫిక్ నేమ్ కాలోట్రోపిస్ ప్రొసెరా.

అలాగే ఈ మొక్కను రబ్బర్ బుష్, యాపిల్ ఆఫ్ సోడోమ్, ఫ్రెంచ్ కాటన్, నాటిక్రెడ్ సేఫ్డ్ ఆక్ ప్లాంట్ వంటి అనేక పేర్లతో పిలుస్తారు. ఇప్పుడు ఈ మొక్కలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. దాంతో వీటిని ఆన్లైన్‌లో అమ్ముతున్నారు. సిటీలలో ఉన్నవారికి ఈ మొక్కలు అంతగా లభించకపోవచ్చు కానీ పల్లెటూర్లలో ఉండే వారికి విరివిగా లభిస్తాయి. ఈ మొక్కను ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన ఔషధంగా పరిగణిస్తారు. ఈ మొక్క పువ్వులు తెలుపు లేత ఊదా రంగులో ఉంటాయి. వీటిని తలనొప్పి, చెవి నొప్పికి ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకులు, కాండాలను తెంపినప్పుడు పాలు వస్తాయి. ఆ పాలను తలకు పట్టిస్తే మైగ్రేన్‌ తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ జిల్లేడు మొక్క నుంచి వచ్చే పాలు కంట్లో పడితే కళ్ళు పోతాయని చాలామంది వాటి జోలికి కూడా వెళ్ళరు. కొంతమంది జిల్లేడు మొక్కలను పూజిస్తూ ఉంటారు.

కాగా ఈ జిల్లేడు ఆకు ఆకుల రసాన్ని చెవుల్లో వేసుకుంటే చీము, చెవిపోటు మొదలైన చెవి సంబంధిత వ్యాధులు నయమవుతాయి. అలాగే ముఖంపై నల్లటి మచ్చలు, ముడతలు తొలగిపోవాలంటే అర చెంచా పసుపు పొడి, రెండు చెంచాల జెల్లేడు ఆకుల నుంచి తీసిన పాలు తీసుకుని కొద్దిగా రోజ్ వాటర్‌లో బాగా కలపాలి. ఆ పేస్ట్‌ను ముఖానికి రాసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. అయితే ఈ పేస్ట్‌ను అప్లై చేసేటప్పుడు కళ్లకు దూరంగా అప్లై చేయాలి. ఇది కళ్ళకు ప్రాణాంతకం అని రుజువైంది. కాబట్టి కళ్లలో పడకుండా చూసుకోవాలి. చర్మాన్ని మృదువుగా చేయడానికి, ముఖానికి మెరుపు కోసం మగవారు, మహిళలు ఈ మొక్క ఆకు పాలు లేదా కొమ్మల పాల రసాన్ని కూడా ఉపయోగించవచ్చు. అలాగే ఈ మొక్క ఆకును లేదంటే మొగ్గలను తుంచినప్పుడు వచ్చే తాజా పాలను తాజా గాయానికి పూస్తే చాలా మేలు కలుగుతుంది. కొన్నిసార్లు గడ్డలు, దద్దుర్లకు కూడా వాడుతారు. వాటి చికిత్స కోసం, ఆకువా ఆకులపై గోరువెచ్చని ఆవాల నూనెను పూసి, గడ్డపై కట్టడం లేదా దురద ఉన్న ప్రదేశంలో పూయడం వలన వ్యాధి నుంచి ఉపశమనం పొందవచ్చు.