ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. బరువు పెరగడం ఈజీనే కానీ బరువు తగ్గడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పాలి. నెల రోజుల్లో విపరీతమైన బరువు పెరిగితే అదే బరువు తగ్గించుకోవడానికి ఇంకా ఎక్కువ నెలలు సమయం పడుతుంది. ఇకపోతే బరువు తగ్గడం కోసం మార్నింగ్ లు వాకింగ్ చేయడం ఎక్ససైజ్లు చేయడం జిమ్ కి వెళ్లడంతో పాటు కొన్ని హోమ్ రెమెడీలు వంటివి కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గడం లేదని చాలామంది దిగులుతూ ఉంటారు. అయితే గుడ్డును తీసుకుంటే బరువు ఈజీగా తగ్గవచ్చునని చెబుతున్నారు. మరి ఈజీగా బరువు తగ్గాలంటే గుడ్డును ఏ విధంగా తింటే మంచిదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గుడ్డును సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఉడికించిన కోడిగుడ్డులో దాదాపుగా 77 కేలరీలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, విటమిన్ బి 5, విటమిన్ బి 12, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్, ఆరు గ్రాముల ప్రోటీన్, ఐదు గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటాయి. గుడ్లను తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లెవెల్ పెరుగుతుంది. ఎక్కువ హెచ్డిఎల్ స్థాయిలు ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఆరు వారాల పాటు ప్రతిరోజూ రెండు గుడ్లను తినడం వల్ల హెచ్డిఎల్ స్థాయిలు 10 శాతం వరకు పెరుగుతాయట. గుడ్లు కోలిన్ కు మంచి మూలం. ఇది మెదడులో సిగ్నలింగ్ అణువుల ఉత్పత్తికి సహాయపడుతుందని చెబుతున్నారు.
అయితే గుడ్డుతో ఉత్తమ ఫలితాలను పొందడం కోసం ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా గుడ్డును తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇది శరీరాన్ని శక్తివంతంగా చేయడంతో పాటు కడుపున తొందరగా నింపుతుందట. ఉదయాన్నే జీర్ణ వ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తుందని,గుడ్డులో ఉన్న ప్రోటీన్లు అలాగే ఇతర పోషకాలు జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అయితే బరువు తగ్గాలి అనుకున్న వారు తక్కువ వేడి వద్ద వంట చేయడం వల్ల కొలెస్ట్రాల్ ఆక్సీకరణ తగ్గుతుంది. ఇది గుడ్డులోని చాలా పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా ఉడికించిన గుడ్లు తినడానికి మంచివి. ఉడికించిన కోడి గుడ్డును తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల కూడా అనవసరమైన కేలరీలు పెరగవు. గుడ్లను ఉడికించడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుంది. గుడ్లను నీటిలో 6-10 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎక్కువ సేపు ఉడికించడం వల్ల పచ్చసొన గట్టిపడుతుంది.ఎగ్ ఆమ్లెట్ నచ్చని వారు ఎవ్వరూ ఉండరు. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలతో దీన్ని తయారుచేసుకుని తింటే బలే టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారుచేయడం చాలా సులువు. గుడ్డు ఆమ్లెట్ తిన్నా మీరు దీని ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి గుడ్డును తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో త్వరగా ఆకలి వేయదు. అప్పుడు ఈజీగా బరువు తగ్గవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..
note: పైన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. అందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.