కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్డులో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కోడిగుడ్డులో ఎన్నో పోషకాలు ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. అయితే కోడిగుడ్డుని తరచుగా తినడం వల్ల ఈజీగా బరువును తగ్గించుకోవచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్లు ప్రోటీన్ కు మంచి మూలం.
వీటిలో గుండెకు ఆరోగ్యకరమైన అసంతృప్త కొవ్వులు కూడా ఉంటాయి. ఇది విటమిన్ బి 6, విటమిన్ బి 12, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలకు గొప్ప మూలం. గుడ్లను తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలువబడే అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లెవెల్ పెరుగుతుంది. ఎక్కువ హెచ్డిఎల్ స్థాయిలు ఉన్నవారికి గుండె జబ్బులు, స్ట్రోక్ , ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదం తక్కువగా ఉంటుందట. ఆరు వారాల పాటు ప్రతిరోజూ రెండు గుడ్లను తినడం వల్ల హెచ్డిఎల్ స్థాయిలు 10 శాతం వరకు పెరుగుతాయట. గుడ్లతో ఉత్తమ ఫలితాలను పొందడానికి మీరు దీన్ని బ్రేక్ ఫాస్ట్ లో తినాలట.
ఇది మన శరీరాన్ని శక్తివంతంగా చేసి, అలాగే మీ కడుపును తొందరగా నింపుతుందని చెబుతున్నారు. అంతేకాదు ఉదయాన్నే జీర్ణవ్యవస్థ ఉత్తమంగా పనిచేస్తుందట. గుడ్డులో ఉన్న ప్రోటీన్లు, ఇతర పోషకాలను జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపర్చడానికి సహాయపడతాయని చెబుతున్నారు. బరువు తగ్గాలి అనుకున్న వారు తక్కువ వేడి వద్ద వంట చేయడం వల్ల కొలెస్ట్రాల్ ఆక్సీకరణ తగ్గుతుంది. ఇది గుడ్డులోని చాలా పోషకాలను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ఈ కారణంగా ఉడికించిన గుడ్లు తినడానికి మంచివి. ఉడకబెట్టిన గుడ్లను తినడం వల్ల కూడా అనవసరమైన కేలరీలు పెరగవు. గుడ్లను ఉడికించడం వల్ల ప్రమాదకరమైన బ్యాక్టీరియా నాశనం అవుతుందట.