ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక రక్తపోటు, రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక రక్తపోటు కారణంగా ఉన్నట్లుందడి బీపీ అమాంతం పెరిగిపోవడం, లేదంటే అమాంతం తగ్గిపోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రక్తపోటు సమస్యలు తరచుగా వస్తూ ఉంటే దాని ప్రభావం గుండెపై పడుతుంది. దీని కారణంగా గుండె పోటు, మధుమేహం, మూత్రపిండాలలో తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచాలి అంటే నాలుగు రకాల పానీయాలు తాగాలి అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆమ్లా, అల్లం రసం… ఆమ్లా లేదా ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటు అభివృద్ధిని నిరోధిస్తుంది. అల్లంలో రక్తనాళాలు విస్తరించే వాసోడైలెష్న్ ను ప్రోత్సహించే సమ్మేళనాలు ఉన్నాయి.
ధనియాల నీరు… ధనియాలు లేదా కొత్తిమీర సారం మూత్ర విసర్జనగా పని చేస్తుంది. శరీరంలోని అదనపు సోడియం, వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడి రక్తపోటుని తగ్గిస్తుంది.
బీట్ రూట్ టొమాటో జ్యూస్… బీట్ రూట్ ల్లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. దీనికి రక్తపోటుని తగ్గించే సామర్థ్యం ఉండి. నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేసి రక్తప్రవాహంలో దాని సాంద్రత పెంచుతుంది. ఎండోథెలియల్ పనితీరుని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇక టొమాటో సారం లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ వంటి కెరొటీనాయిడ్లు కలిగి ఉంటుంది.