Fat Burning : ఈ ఏడు పదార్థాలను ఎంత తిన్నా లావు కారు…మీరు ట్రై చేయండి..!!!

ఈమధ్య కాలంలో మారిన జీవనశైలి ఒకవైపు...జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇంకోవైపు....ఇలా శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోతూ...ఊబకాయం వస్తోంది. దాంతో మెల్లగా డయాబెటిస్, గుండె జబ్బులు వంటివీ ఇబ్బంది పెడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 2, 2022 / 11:00 AM IST

ఈమధ్య కాలంలో మారిన జీవనశైలి ఒకవైపు…జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ ఇంకోవైపు….ఇలా శరీరంలో కొవ్వు పెరిగిపోతోంది. దీంతో విపరీతంగా బరువు పెరిగిపోతూ…ఊబకాయం వస్తోంది. దాంతో మెల్లగా డయాబెటిస్, గుండె జబ్బులు వంటివీ ఇబ్బంది పెడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది బరువు తగ్గడం గురించి ఆలోచిస్తున్నారు. ప్రొద్దున, సాయంత్రం, వ్యాయామాలు, వాకింగ్ వంటివి చేస్తున్నారు. డైటింగ్ చేస్తూ సన్నబడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆహారం విషయంలో విపరీతమైన ఆందోళన చెందుతున్నారు. ఏం తినాలో…ఏం తినకూడదో అనే గందరగోళంలో ఉంటున్నారు. ఈక్రమంలోనే అటు వ్యాయామం చేస్తూ…ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వును నియంత్రించుకుంటూ…బరువు తగ్గొచ్చని…మరీముఖ్యంగా 7రకాల ఆహార పదార్థాలు దీనికి తోడ్పడుతాయని నిపుణులు చెబుతున్నారు.
1. క్వినోవా…
బరువు తగ్గాలనుకునేవారు బియ్యానికి బదులుగా క్వినోవాను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్వినోవాలో ప్రొటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అధిక ప్రొటీన్లు శరీరానికి శక్తిని ఇస్తాయంటున్నారు. అంతేకాదు ఇవి జీవక్రియలను మెరుగుపరుస్తాయని…శరీరంలో కేలరీలు తొందరగా కరిగిపోవడానికి తోడ్పడుతాయని చెబుతున్నారు. శరీరానికి అత్యంత ఆవశ్యక పోషకాలైౌన విటమిన్ ఈ, ఐరన్, జింక్, సెలీనియం వంటివి క్వినోవాలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. రాజ్మా, ఛోలే వంటి కూరలతో క్వినోవాను కలిపి తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని వివరిస్తున్నారు.

2. గుడ్లు….
రోజూ గుడ్డు తింటే ఆరోగ్యం బాగుంటుంది…ఇది పాత మాట. అయినప్పటికీ గుడ్లు శరీరం బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు తోడ్పడతాయని నిపుణులు అంటున్నారు. గుడ్లలో పుష్కలంగా ఉండే ప్రొటీన్లు, శరీరానికి తగిన శక్తిని ఇవ్వడంతోపాటు కడుపునిండిన భావనను కలిగిస్తాయని వివరిస్తున్నారు. దీంతో తరచూ ఏదొకటి తినే అలవాటు తప్పుతుందని స్పష్టం చేస్తున్నారు. తక్కువ కేలరీలు ఉండే డైట్ ను అనుసరిస్తున్నవారు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.
3. గ్రీన్ టీ….
ఈమధ్యకాలంలో జనాల్లో గ్రీన్ టీపై అవగాహన పెరిగింది. అది రోగనిరోధకశక్తికి తోడ్పడుతుందన్న ఉద్దేశ్యంతో చాలామంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు. అయితే గ్రీన్ టీ శరీరంలోని జీవక్రియలను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు. కేలరీలు వేగంగా కరిగిపోయేందుకు గ్రీన్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీంతో శరీరంలో కొవ్వు పదార్థాల చేరియ నియంత్రణలో ఉంటుందంటున్నారు.

4. కాఫీ…
మార్నింగ్ లేవగానే కాఫీ లేనిదే చాలామందికి రోజు గడవదు. కాఫీతో శరీరంలో జీవక్రియల రేటు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వ్యాయామాలు చేసే సమయంలో కాఫీ తీసుకోవడం వల్ల…కొవ్వు కరిగే వేగం రెండింతలు అవుతుందని చెబుతున్నారు. కాఫీలోని కెఫీన్ వల్ల ఉత్సాహం ఉంటుందని…శారీరకంగా మరింత కష్టించడానికి ఇది తోడ్పడుతుందని చెబుతున్నారు.
5. ఆకులతో కూడిన కూరగాయలు..
ఆకులతో కూడిన కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ శాతం నియంత్రణలో ఉంటుందని నిపుణులు అంటున్నారు. పాలకూర, కేల్, లెట్యూస్, క్యాబేజీ వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు. అందులో ఉండే ఐరన్, మెగ్నీషియం, విటమిన్లు శరీరానికి శక్తిని ఇవ్వడంతోపాటు జీర్ణశక్తిని పెంచుతుందంటున్నారు. ఇదే సమయంలో కొవ్వు కరిగే వేగాన్ని పెంచేందుకు తోడ్పడతాయని అంటున్నారు.
6. కొబ్బరి నూనె…
కొబ్బరి మన శరీరానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరితోపాటు కొబ్బరి నీళ్లు, నూనె ఇవన్నీ ప్రయోజనం కలిగిస్తాయని చెబుతున్నారు. కొబ్బరినూనె వాడటం వల్ల శరీరంలో జీవక్రియలు మెరుగుపడతాయని…కడుపునిండిన భావన ఉంటుందని చెబుతున్నారు.
7. రాజ్మా..
శాఖాహారులకు పుష్కలంగా ప్రొటీన్లు అందాలంటే…రాజ్మా, ఇతర బీన్స్ ను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. మాంసాహారానికి ప్రత్యామ్నాయంగా కిడ్నీ బీన్స్ లో ఫైబర్, క్లిష్టమైన కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కడుపునిండిన భావనను కలిగిస్తాయని నిపుణులు అంటున్నారు. దీంతో ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుందని వివరిస్తున్నారు.