Health: నిరంతర ఆలోచనలతో ప్రమాదమే

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 06:23 PM IST

Health: నిరంతరం అతిగా ఆలోచిస్తే మనశ్శాంతిని కోల్పోవాల్సి వస్తుంది. రక్తపోటును మరింత పెంచి ఒత్తిడికి దారితీస్తుంది. స్ట్రోక్ , గుండెపోటు వంటి గుండె సమస్యలకు దారితీస్తుంది. అధిక ఒత్తిడి అంటే అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగటంతోపాటు దీనినుండి బయటపడేందుకు ధూమపానం,మద్యపానం వంటి అనారోగ్య అలవాట్లను అనుసరించే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సమస్యలు తలెత్తుతాయి.. అంతులేని ఆలోచనలు మిమ్మల్ని రాత్రిళ్లు మేల్కొనేలా చేస్తాయి. నిద్రపోవడంలో సమస్యలను ఎదుర్కోవడం అనేది అతిగా ఆలోచించడం వల్ల జరుగుతుంది.

అతిగా ఆలోచించే వారైతే రాత్రిపూట మంచి నిద్ర పట్టదు. మరుసటి రోజు ఉదయం గజిబిజిగా, పిచ్చిగా , అలసట వంటి పరిస్ధితి ఎదుర్కొంటారు. పనిపై దృష్టి పెట్టడం కష్టతరంగా మారుతుంది. బరువు పెరగడంతోపాటు అతిగా ఆహారం తీసుకునేలా చేస్తుంది. అతిగా ఆలోచించడం ఆకలిని అణిచివేస్తుంది.. తక్కువ సమయం పాటు ఎక్కువగా ఆలోచించడం ఆకలి లేకుండా చేస్తుంది. ఎందుకంటే ఇది మీ మెదడు పై ప్రభావం చూపిస్తుంది.