Eating: తిన్న తర్వాత ఇలాంటి పనులు చేయకండి…!

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు.

  • Written By:
  • Publish Date - February 2, 2022 / 06:30 AM IST

ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఏ ఒక్కరూ కూడా తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు. పర్యావసనంగా నేడు ప్రతి ఒక్కరూ అనారోగ్యం పాలుకావాల్సి వస్తుంది. తినే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుపోడంతో ఎన్నోరోగాలు మనల్ని చుట్టుకునే ప్రమాదం ఉంది. వ్యక్తిగత జీవితంలో నిమగ్నమైన తన ఆరోగ్యాన్ని అశ్రద్ద చేసినట్లయితే…అయి మనపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మధుమేహం, థైరాయిడ్, హైబీపీ వంటి ప్రమాదకర జబ్బులకు గురికావల్సి వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పౌష్టిక విలువలతో కూడుకున్నదైతేనే ఎటువంటి రోగాలు రావు. అంతేకాదు ఎంతో ఆరోగ్యంగా ఫిట్ గా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కొన్ని రకాల ఆహార పదార్థలు మన ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయి. అటువంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా తిన్న తర్వాత కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నట్లయితే…ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. మరి ఎలాంటి ఆహార పదార్థాలను తిన్న తర్వాత తీసుకోకూడదో తెలుసుకుందాం.

టీ, కాఫీ: సాధారణంగా కొంతమందికి టీ లేదా కాఫీ ఉదయాన్ని తీసుకునే అలవాటు ఉంటుంది. ఎలాంటి ఆహారం తీసుకోకముందే వీటిని తీసుకుంటారు. కానీ ఇంకొంతమంది ఆహారం తిన్న తర్వాత టీ, కాఫీ తాగుతుంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. తిన్న తర్వాత టీ తాగినట్లయితే…జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీ కానీ కాఫీ కానీ తాగే గంట ముందు ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. ఎందుకంటే టీ లో ఉండే టానిక్ అనే రసాయనం ఐరన్ శోషన ప్రక్రియకు అడ్డుగా నిలుస్తుంది. దీంతో తీవ్రమైన తలనొప్పి, రక్తహీనత, కాళ్లు చేతుల నొప్పులు వస్తుంటాయి. అంతేకాదు ఇది ఆకలి మందగించేలా చేస్తుంది.

ఆల్కహాల్: ఆహారం తీసుకున్న వెంటనే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఫుడ్ తీసుకున్న తర్వాత మద్యం తాగితే అది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపెడుతుంది. అంతేకాదు ప్రేగులపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే భోజనం చేయడానికి ఒక అర్దగంట ముందు మందును తీసుకోకూడదు. అలాగే భోజనం చేసిన ఒకటి లేదా రెండు గంటల వరకు మద్యం తాగకూడదు.

అలాగే భోజనం చేసిన వెంటనే చాలామంది మంచినీళ్లను తాగుతుంటారు. అలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే తిన్న వెంటనే మంచినీళ్లను తాగితే కడుపులో సమస్యలు వస్తాయి. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతాయి. తిన్న వెంటనే కాకుండా అర్దగంట గ్యాప్ ఇచ్చిన తర్వాత మంచినీళ్లగా తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు.

పండ్లు: భోజనం చేసిన తర్వాత చాలామంది పండ్లను తింటుంటారు. అది మంచి పద్ధతి కాదు. భోజనం చేసిన తర్వాత లేదా టిఫిన్ తర్వాత పండ్లను తిన్నట్లయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు పండ్లను ఖాళీ కడుపున తినొద్దు. తిన్నట్లయితే ఉదర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు