Dog Bite: కుక్క కరిచిన తర్వాత చేయాల్సిన పనులు ఇవే.. ఇక అంతే సంగతులు?

సాధారణంగా ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కుక్కలు

  • Written By:
  • Updated On - September 28, 2022 / 08:51 PM IST

సాధారణంగా ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినప్పుడు, లేదంటే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కుక్కలు ఎవరో కొత్త మనుషులు వచ్చారు అని కరుస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మనం చేసే తిక్క పనుల వల్ల మన ఇంట్లో పెంచుకునే కుక్కలే మనల్ని అరుస్తూ ఉంటాయి. అలాగే ఇంకొన్ని సందర్భాలలో అనగా కుక్కలకు కొంచెం కోపం వచ్చినప్పుడు అలాగే ఎండ వేడి వాతావరణం సరిగా లేనప్పుడు వారికి చిరాకు వస్తుంది. అటువంటి సమయంలో అవి మనల్ని కరుస్తూ ఉంటాయి. మరి కుక్క కరిచినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కుక్క కరవడం వల్ల రేబిస్ అనే వైరస్ సోకుతుంది. కుక్క కరిస్తే దాని నుంచి వచ్చే వైరస్ మనిషి బ్రెయిన్ దెబ్బతీస్తుంది. అందువల్ల కుక్కల నుంచి మనుషులకు రేబిస్ వ్యాధి సోకకుండా ఉండటం కోసం కుక్కలను వారు వాటికి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇంజక్షన్లు వేయించాలి. అలా ఇంజక్షన్లు వేయిస్తే కుక్కలు కలిస్తే రేబిస్ వైరస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కుక్క కరిచిన తర్వాత ముందుగా గాయాన్ని మెత్తటి సబ్బుతో కడగాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిని మెల్లగా పదినిమిషాల పాటు గాయం పై పోయాలి. ఆ తర్వాత మంచి బట్ట తీసుకుని రక్తం కారునివ్వకుండా మెల్లగా తుడవాలి.

ఒకవేళ మీ దగ్గర యాంటీబయోటిక్ క్రీమ్ లాంటిది ఉంటే దానిపై రాయాలి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి కట్టు కట్టించుకొని రోజుకు ఆ బ్యాండ్ ని కనీసం రెండు మూడు సార్లు అయినా మార్చుతూ ఉండాలి. కరిచిన చోట గాయాన్ని గమనిస్తూ దురద వస్తుందా ఎర్రగా అవుతుందా చెమట పడుతుందా ఇలాంటివన్నీ గమనిస్తూ ఉండాలి. అప్పుడు డాక్టర్లు ఆ గాయాన్ని పరిశీలించి చిన్నపాటి ట్రీట్మెంట్ చేసి రేబిస్ వైరస్ సోకకుండా ఇంజక్షన్ చేస్తారు.