Health Talk : వీళ్లు బొప్పాయి అసలు తినకూడదు, ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!!

కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి బొప్పాయి పండు.

  • Written By:
  • Publish Date - September 12, 2022 / 02:51 PM IST

కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. అందులో ఒకటి బొప్పాయి పండు. తినడానికి ఎంతో రుచిగా ఉండే ఈ బొప్పాయిలో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. వారి ఆరోగ్యానికి బొప్పాయి అస్సలు పడదు. ఎందుకంటే ఆరోగ్యం కంటే…హానికరమే ఎక్కువగా ఉంటుంది. అయితే బొప్పాయి పండును ఎవరు తినకూడదు…ఎవరు తినాలో తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీలు:
గర్బాధారణ సమయంలో సరైన ఆహారం తీసుకోవాలి. పౌష్టికాహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో బొప్పాయిని తినకూడదని వైద్యులు చెబుతుంటారు. ఎందుకంటే బొప్పాయి తినడం వల్ల అకాల పుట్టుటకు దారితీస్తుంది. అయితేకాదు శిశువు పట్టుకునే బొడ్డు తాడు బలహీనంగా మారుతుందని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పూర్తిగా మగ్గినది కొంచెం తింటే పర్వాలేదు కానీ పచ్చి బొప్పాయిని అస్సలు ముట్టకూడదు.

గుండె జబ్బులు ఉన్నవారు:
బొప్పాయి పండు..గుండెకు ఎంతో మేలు చేస్తుంది. అయితే గుండె సమస్యలుఉన్నవారు ఈ పండును తినకూడదు. బొప్పాయిలో ఉండే ఒక రకమైన అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది గుండెకు చాలా హానికరం. హైపోథైరాయిడిజంతో బాధపడేవారికి ఇది జరగదు.

అలెర్జీ:
కొంతమందికి అలర్జీ సమస్యలు ఉంటాయి. అలాంటివారు బొప్పాయి తింటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, దగ్గు, కళ్ల నుంచి నీరు కారడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అంతేకాదు బొప్పాయి వాసన చూస్తే కొంతమందికి అలెర్జీ వస్తుంది. అలాంటివారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

కిడ్నీల్లో రాళ్లు ఉన్నవాళ్లు:
బొప్పాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది మంచి యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉన్న పండు. రోగనిరోధకశక్తిని కూడా పెంచుతుంది. ఈ పండు తింటే కిడ్నీరాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

హైపోగ్లైసీమియా సమస్య ఉంటే:
రక్తంలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉన్నవారు బొప్పాయి తినకూడదు. కొందరికి గుండె కొట్టుకునే వేగం పెరగుతుంది. మరికొందరికి వణుకు, మానసిక గందరగోళం వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఇలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండటం మంచిది.