Monsoon Diet: వర్షాకాలంలో ఈ కూరగాయలు అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

వర్షాకాలం మొదలయ్యింది. అప్పుడే పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాకాలంలో కొన్ని రకాల

Published By: HashtagU Telugu Desk
Anti Pollution Diet

Monsoon Diet

వర్షాకాలం మొదలయ్యింది. అప్పుడే పలుచోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాకాలంలో కొన్ని రకాల కాయగూరలకు దూరంగా ఉండాలట. ఈ వర్షాకాలంలో కొన్ని రకాల కాయగూరాలు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు ఇన్ఫెక్షన్ లకు గురికావడం తద్వారా జీర్ణక్రియ కు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. మరి వర్షాకాలంలో తినకూడని ఆ కూరగాయలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో కూరగాయలు చాలా త్వరగా పాడైపోతూ ఉంటాయి. పదేపదే వర్షాలు పడడం వల్ల ఆ తేమ తగిలి కాయగూరాలు ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయి. ఈ క్రమంలోనే వాటిలో క్రిములు కూడా భారీగా ఏర్పడతాయి. అవి తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. మరి అటువంటి కాయగూరల్లో ముఖ్యంగా బెండకాయ, కాలీఫ్లవర్, బటాని లాంటి కూరగాయలను వర్షాకాలంలో తినకూడదట. ఈ మూడు కూరగాయలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇవి తినడం వల్ల జీర్ణ వ్యవస్థను కూడా నెమ్మదింపజేస్తాయి. దానివల్ల ఉదర సమస్యలు కూడా తలెత్తుతాయి.

అలాగే వర్షాకాలంలో పచ్చి ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. అయితే ఆకుకూరలు తింటే సమస్యలు ఏంటి అని అనుకుంటున్నారా… ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ వర్షాకాలంలో ఆకుకూరలపై ఎక్కువ మొత్తంలో బ్యాక్టీరియా చేరుతుంది. దానివల్ల అనేక రకాల వ్యాధులకు కారణం అవుతుంది. అలాగే పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్, వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది అని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ఇందుకుగల కారణం వీటిలో అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే వీటిని వర్షాకాలంలో ఎక్కువగా తినకూడదట. వీటిపై కూడా అధికంగా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుంది. తద్వారా అనారోగ్య సమస్యల బారిన పడతారు.

  Last Updated: 18 Jul 2022, 06:02 PM IST