ప్రస్తుత రోజుల్లో ప్రతి పది మందిలో 8 మంది ఇబ్బంది పడుతున్న సమస్య డయాబెటిస్. ఈ డయాబెటిస్ కారణంగా చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. షుగర్ వ్యాధి ఒకసారి వచ్చింది అంటే చాలు, మళ్లీ అస్సలు పోదు. అయితే ఈ షుగర్ వ్యాధి వచ్చిన వారు ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తినే ఆహారం విషయంలో, మందుల విషయంలో, తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. డయాబెటిస్ జీవితాంతం మిమ్మల్ని విడిచిపెట్టదు. ఎందుకంటే దీన్ని పూర్తిగా నయం చేసుకోలేం. అందుకే ఈ వ్యాధి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
అయితే ఈ వ్యాధి ఉన్నవారు దీన్ని నియంత్రించానికి ఆహారంలో మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే శారీరకంగా చురుగ్గా ఉండాలట. డయాబెటీస్ పేషెంట్లకు కొన్ని రకాల చిరుధాన్యాలు మంచి మేలు చేస్తాయని చెబుతున్నారు. వీటిని డయాబెటీస్ లేనివారు కూడా తినవచ్చట. చిరుధాన్యాలు. రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు. ఇందులో ఉండే ప్రోటీన్, ఫైబర్ డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తాయి. ఇది శరీరంలో గ్లూకోజ్ శోషణను నెమ్మదింపజేస్తుంది. దీంతో డయాబెటిస్ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగవు. ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహిస్తుంది.
ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. చిరు ధాన్యాల పిండితో తయారు చేసిన రోటీ మొదలైన వాటిని తినవచ్చు. ఇందులో మొదటివి రాగులు. రాగుల్లో ఉండే పాలీఫెనాల్స్, యాంటీ డయాబెటిక్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పాలీఫెనాల్స్ పండ్లు, కూరగాయలు, ధాన్యాలు వంటి మొక్కల ఆధారిత ఆహారాలలో ఉండే ఒక రకమైన సూక్ష్మపోషకాలు కూడా రాగుల్లో పుష్కలంగా ఉంటాయి.
ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే జొన్నల్లో స్మార్ట్ కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. దీన్ని తీసుకోవడం వల్ల గ్లూకోజ్ రక్తంలోకి ప్రవేశిస్తుంది. అలాగే ఇది వెంటనే రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు. అలాగే జొన్నలు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది. మీరు అన్నానికి బదులుగా జొన్నల రొట్టెను తినవచ్చు. టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఇది మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు.