Site icon HashtagU Telugu

Winter: చలికాలంలో దగ్గు,జలుబు త్వరగా తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే!

Winter

Winter

చలికాలం మొదలైంది అంటే చాలు సీజనల్ వ్యాధులు దగ్గు జలుబు జ్వరం వంటివి తీవ్ర ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు వీటి కారణంగా తలనొప్పి కూడా భరించలేని విధంగా ఉంటుంది. దీంతో దగ్గు జలుబును తగ్గించుకోవడానికి చాలా మంది ఎన్నెన్నో చిట్కాలను ఫాలో అవుతూ ఉంటారు. ఇంకొందరు మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినప్పటికీ కొన్ని కొన్ని సార్లు ఉపశమనం లభించదు. కొంతమందిని దగ్గు జలుబు సమస్య నెలల తరబడి వేధిస్తూ ఉంటుంది. చలికాలంలో దగ్గు, జలుబు వచ్చాయంటే అంత తొందరగా తగ్గవు. పైగా ఊపిరితిత్తుల్లో కఫం పేరుకుపోతుంది. అలాంటప్పుడు కొన్ని సింపుల్ చిట్కాలను ఉపయోగిస్తే బయటపడవచ్చు అని చెబుతున్నారు.

ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అల్లం లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఊపిరితిత్తుల్లోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కాబట్టి దగ్గు నివారణకు అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. అల్లం చిన్న ముక్కలుగా కట్‌ చేసిన రోజూ ఒక గంట పాటు తినడం వల్ల కూడా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుందట. తేనె కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ మైక్రోబయాల్‌ లక్షణాలు ఉంటాయి. అలాగే నియాసిన్‌, రైబోఫ్లోవిన్‌ వంటి మూలకాలను కలిగి ఉంటుంది. ఇవి ఊపిరితిత్తుల్లోని కఫాన్ని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గోరువెచ్చటి నీటిలో ఒక చెంచా తేనె కలిపి తాగడం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్ని చెబుతున్నారు..బెల్లంలో ఐరన్‌, మెగ్నీషియం, పొటాషియం వంటి కీలకమైనరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయట. అలాగే శ్వాస సమస్యలను కూడా దూరం చేస్తాయట. పొడి దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు. తమలపాకులో కూడా యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి దగ్గును రాకుండా చేయడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం పూట తులసి ఆకులను నమలాలి.

అవసరమైతే తులసిని నీళ్లలో వేసి మరగించి కషాయంలా కూడా తీసుకోవచ్చట. దగ్గు, జలుబు వంటి వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు తగ్గించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌, యాంటీవైరల్‌ లక్షణాలు కఫాన్ని తగ్గిస్తాయట.నారింజ, నిమ్మ వంటి సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు రావడం తగ్గుతాయి. అలాగే రాత్రిపూట పొడిదగ్గు ఇబ్బంది పడుతున్నవారూ, నిద్రపట్టకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కాబట్టి పడుకోవడానికి ముందు చిటికెడు వామును చేతిలో నలిపి దవడకు పెట్టుకుని కాసేపు చప్పరించాలి. దీనివల్ల దగ్గు అదుపులోకి వస్తుంది.