Site icon HashtagU Telugu

Battle Gourd: పొరపాటున కూడా ఆ సమస్యలు ఉన్నవారు సొరకాయలను అస్సలు తినకండి?

Mixcollage 30 Jun 2024 06 39 Pm 1206

Mixcollage 30 Jun 2024 06 39 Pm 1206

మన వంటింట్లో దొరికే కూరగాయలలో సొరకాయ కూడా ఒకటి. మనలో చాలా తక్కువ మంది మాత్రమే సొరకాయను తింటూ ఉంటారు. సొరకాయను కొన్ని ప్రదేశాలలో ఆనపకాయ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని ఉపయోగించి కేవలం కూరలు మాత్రమే కాకుండా కొన్ని చోట్ల స్వీట్లు కూడా తయారు చేస్తూ ఉంటారు. ఈ సొరకాయ చాలా రకాల వ్యాధులకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. సొరకాయ జ్యూస్ తాగితే శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి, టాక్సిన్లు బయటకు పోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఆరోగ్యానికి మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు సొరకాయను తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు సొరకాయను తినకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సొరకాయలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలు దూరం చేస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు ఫైబర్ తో పాటుగా ఇందులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉంటాయి.

అలాగే ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు శరీరం నుండి కొవ్వును పైత్యాన్ని విసర్జించడంలో సహాయపడుతుంది. అలాగే కాలేయ వ్యాధుల చికిత్సలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు శరీరంలో అధికంగా వేడి ఉన్నవారు, పైల్స్, మలబద్ధకం, వేడి కురుపులు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు సొరకాయ తింటే మంచిది. సొరకాయ శరీరాన్ని చల్లబరుస్తుంది. సొరకాయలో ఫైబర్ ఉండడంతో అది మలబద్ధకాన్ని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. అదేవిధంగా సొరకాయ రక్తంలో ఉండే చక్కెర , ట్రై గ్లిజరైడ్స్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గిస్తుందని, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడంలో సొరకాయ కీలకంగా పనిచేస్తుంది. అయితే ఎన్నో పోషకాలు ఉన్నప్పటికీ, ఎన్నో రోగాలకు ఉపయోగపడుతున్నప్పటికీ, కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు సొరకాయలు ఎక్కువగా తినకూడదు. ముఖ్యంగా మూడు వ్యాధులతో బాధపడేవారు సొరకాయని తింటే ప్రమాదం అని చెబుతున్నారు. జలుబు, ఆస్తమా, సైనసైటిస్ సమస్య ఉన్నవారు జాగ్రత్త వహించాలి. ఈ మూడు రకాల సమస్యలు ఉన్నవారు సొరకాయను తినకపోవడమే మంచిది.