Site icon HashtagU Telugu

Body: ఈ లక్షణాల్లో ఏదోకటి ఉన్నా…మీ శరీరంలో లోపం ఉన్నట్లే…!

medical notification

Medical Mafia

ఆరోగ్యంగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకుంటారు. మరి ఆరోగ్యంగా ఉండేందుకు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సరైన ఆహారం, నిద్ర ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నామా లేదా అనేది ఖచ్చితంగా తెలియదనే చెప్పాలి. ఆరోగ్యం పట్ల మనం చూపే నిర్లక్ష్యం మన శరీరానికి పెద్ద శత్రువుగా మారుతుందనే చెప్పాలి.

మనం పట్టించుకోని కొన్ని సాధారణ లక్షణాలు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తాయి. ఈ లక్షణాలు చిన్నవిగా అనిపించినప్పటికీ…అవి మనకు చాలా ప్రమాదకరంగా మారుతాయి. అయితే మీరు నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం.

ఆకస్మికంగా బరువు తగ్గడం….
సడెన్ గా బరువు తగ్గినట్లయితే అలసట, నీరసం వస్తుంది. కానీ మీరు బరువు తగ్గడానికి ప్రయత్నించకుండానే ఆరు నెలల్లో మీ శరీర బరువులో పది శాతం పైగా కోల్పోయినట్లయితే మీరు ఆందోళన చెందాల్సిందే.

మానసిక సమస్యలు….
ఆలోచన విధానంలో తరచుగా వచ్చే మార్పులను బైపోలార్ డిజార్డర్, డిస్టిమియా మరియు ప్రమాదకరమైన మానసిక రుగ్మతలు వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. ఇది మీకే కాదు ఇతరులకు చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది.

తలనొప్పి…..
స్వల్పకాలిక తలనొప్పి, రాత్రిసమయంలో తలనొప్పి, తెల్లవారుజామున తీవ్రంగా రావడం, నొప్పి నివారణ మందుల ద్వారా తగ్గకపోవడం తలనొప్పి జ్వరం లేదా మెనింజైటిన్ వంటి తీవ్రమైన రుగ్మతకు ఇవి సంకేతం.

తొందరగా అలసిపోవడం…
నిరంతరం బలహీనత, అలసట క్రానిక్ ఫెటీగ్ సిండ్రోమ్ లక్షణమై ఉండవచ్చు. సరైన పరిష్కారం కోసం వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

నిరంతరం దగ్గు…
నిరంతరం దగ్గు, బరువు తగ్గడం, తక్కువ స్థాయి జ్వరం కూడా తీవ్రమైన అనారోగ్యం లక్షణాలు కావచ్చు. ఇది క్షయ లేదా క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు కారణాన్ని తెలుసుకునేందుకు ఛాతి ఎక్స్ రే చేయించుకోవాలి.

ఛాతిలో నొప్పి…
మీకు ఆకస్మిక ఒత్తిడి, బిగుతు లేదా ఛాతీ కింద అణిచివేసినట్లుగా అనిపించినట్లయితే…మీ దవడ ఎడమ చేయి లేదా వెనుకకు వ్యాపించే నొప్పి గుండెపోటు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి లక్షణాలను ఎప్పుడూ అశ్రద్ధ చేయవద్దు.

పొత్తికడుపులో నొప్పి….
కొన్ని విభిన్న పరిస్థితులు…కొన్ని తీవ్రమైనవి అయితే మరికొన్ని అంతతీవ్రమైనవి కావు. ఇవి కడుపు నొప్పికి కారణం అవుతాయి. మలబద్దకం, ఆహార అలెర్జీలు, అసహనం, ఫుడ్ పాయిజింగ్, అజీర్ణం, ప్రకోప ప్రేగు సిండోమ్, కడుపు వైరస్లు ఇవ్వన్నీ కూడా తక్కువ తీవ్రత కారణాలుగా చెప్పవచ్చు.
మామూలుగా వచ్చే నొప్పికి…తీవ్రతతో వచ్చే నొప్పికి మధ్య వ్యత్యాసాన్ని గమనించండి. ఉదాహరణకు కడుపు ఇన్ఫెక్షన్ తీవ్రమైన కడుపు తిమ్మిర్లకు కారణం అవుతుంది. అది పెద్దప్రేగు క్యాన్సర్ లేదా అపెండిసైటిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
డిప్రెషన్….
డిప్రెషన్ చాలా సాధారణం. ఇది ప్రతిపది మంది అమెరికన్లలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. చికిత్స చేయకుండా వదిలేసినట్లయితే…మీరు బయటకు రావడం చాలా కష్టంగా మారే మానసిక స్థితి అధోముఖానికి కారణం అవుతుంది.
ఒక్కప్పుడు ఇష్టపడే కార్యకలాపాల పట్ల ఆసక్తి కోల్పోవడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నిద్రలేమి ఇవన్నీ కూడా డిప్రెషన్ కు కారకాలు.

Exit mobile version