Site icon HashtagU Telugu

Stroke: స్ట్రోక్ రావడానికి ముందు ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Stroke

Stroke

రక్తం గడ్డకట్టడం లేదంటే రక్తస్రావం కారణంగా మెదడుకు రక్త సరఫరా ఆటంకం ఏర్పడే పరిస్థితిని స్ట్రోక్ అని అంటారు. అయితే ఇది మెదడు దెబ్బతినడానికి దారితీస్తుందట. ప్రధానంగా రెండు రకాల స్ట్రోక్‌ లు ఉన్నాయి. అందులో ఒకటి ఇస్కీమిక్ స్ట్రోక్ రెండవది హెమరేజిక్ స్ట్రోక్. కాగా మన మెదడుకు రక్తాన్ని తీసుకువెళ్లే ధమనిలో అడ్డు పడటం వల్ల ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుందట. అయితే మెదడులోని కొంత భాగంలో రక్తస్రావం అయినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ వస్తుందట. స్ట్రోక్ ప్రాణాంతక ప్రభావాల కారణంగా, ఇది వ్యక్తి శారీరక సామర్థ్యం, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని, దీనిని నిర్లక్ష్యం చేస్తే వైకల్యానికి లేదంటే కొన్నిసార్లు ప్రాణాలకు ప్రమాదం కలగవచ్చని చెబుతున్నారు.

ఈ స్ట్రోక్ వల్ల చాలా వరకు మరణాలే సంభవిస్తూ ఉంటాయి. ఈ  స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే.. స్ట్రోక్‌ కు ముందు, రోగిలో కొన్ని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయట. తీవ్రమైన భరించలేని తలనొప్పి రావడం కూడా స్ట్రోక్ కి కారణమని చెబుతున్నారు. పదేపదే తల నొప్పిగా ఉంటే దానిని అస్సలు విస్మరించకూడదట. ఈ నొప్పి అనేక రకాల కారణాల వల్ల వస్తుందని, తలనొప్పితో పాటు, వాంతులు, తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి ఇతర లక్షణాలను కూడా అనుభవించవచ్చని చెబుతున్నారు. దృష్టి తగ్గడం లేదా అస్పష్టమైన దృష్టి కూడా స్ట్రోక్ లక్షణంగా భావించాలని చెబుతున్నారు.

స్ట్రోక్ కారణంగా మెదడుకు రక్త సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందట. ఇది దృష్టి సమస్యలకు దారితీస్తుందట. మీకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే మీకు అకస్మాత్తుగా కళ్ళు మసకబారడం, పూర్తిగా నల్లగా ఉన్నట్లు అనిపిస్తుందట. ఇది కూడా స్ట్రోక్ కి ఒక రకమైన లక్షణంగా భావించాలని చెబుతున్నారు. అలాగే స్ట్రోక్ వచ్చే ముందు రెండు చేతులు లేదా కాళ్ళలో బలహీనత భావన కలుగుతుందట. రోగి ఒక చేయిలో తిమ్మిరిని అనుభవించవచ్చట. కొంతమందికి చేతులు పైకి లేపడంలో ఇబ్బంది ఉండవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ స్ట్రోక్ వచ్చే ముందు సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఎదుటి వ్యక్తి మాట్లాడిన మాటలు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం లాంటి సమస్యలు కూడా కనిపిస్తాయట. అలాగే నడకలో కూడా కొంచెం మార్పు కనిపిస్తుందని పైన చెప్పిన లక్షణాలు కనిపించినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు.