High Cholesterolol : కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలంటే ఇవి తినాల్సిందే..!!

మనం తీసుకునే ఆహారం...మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 17, 2022 / 09:40 AM IST

మనం తీసుకునే ఆహారం…మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సరైన పోషకాలు లేని ఆహారం తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉన్నట్లయితే రక్తంలో అడ్డంకులు ఏర్పాడతాయి. స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. అందుకే ఎప్పుడూ కూడా సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం జోలికి వెళ్లకూడదు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కరిగే ఫైబర్, వెయ్ ప్రొటన్స్ ను ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు చెబుతుంటారు. ఇవే కాకుండా ఆరోగ్య నిపుణులు అనేక ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తినాలని చెబుతారు. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

చేపలు తినండి:
మీరు నాన్-వెజ్ ఫుడ్ తినాలనుకుంటే.. మీ ఆహారంలో సీఫుడ్‌ను చేర్చుకోవచ్చు. వాటిలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు సీఫుడ్స్ లో పుష్కలంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది.

పప్పు తినండి:
పప్పులో ప్రొటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే మంచి బ్యాక్టీరియా పెంచుతుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. పప్పులు తినడం వల్ల షుగర్ కూడా అదుపులో ఉంటుంది.

డ్రై ఫ్రూట్స్:
బాదం, పిస్తా, వాల్‌నట్‌లు, అవిసె గింజలు, నువ్వులు, ఎండు గింజలు తీసుకోవడం వల్ల గుండె జబ్బులు తగ్గుతాయి. సింపుల్ గా చెప్పాలంటే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇందుకోసం డ్రై ఫ్రూట్స్, విత్తనాలను రోజూ తీసుకోండి.