Plants Bomb Vs Mosquitoes : దోమలపై సిక్సర్.. ఈ 6 మొక్కలతో వాటిని తరిమేయండి !

Plants Bomb Vs Mosquitoes : దోమ.. దోమ.. దోమ.. ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న పెద్ద సమస్య.. 

  • Written By:
  • Updated On - August 29, 2023 / 01:26 PM IST

Plants Bomb Vs Mosquitoes : దోమ.. దోమ.. దోమ.. 

ఇది ఇప్పుడు ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న పెద్ద సమస్య.. 

దోమలు కుట్టడం.. మనం ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం కామన్ గా మారింది. 

ఇలాంటి టైంలో దోమలను ఇంటి నుంచి తరిమికొట్టే శక్తిగల కొన్ని మొక్కల గురించి తెలుసుకుందాం.. 

Also read : Solar Mission Aditya L1: సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 బడ్జెట్ ఎంతంటే..?

1. వేప మొక్క

వేప మొక్క  వెరీ స్పెషల్. ఇందులోని ఎన్నెన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు వేప సొంతం. ఫలితంగా ఇది దోమలను దూరంగా ఉంచగలదు. బోన్సాయి (మరుగుజ్జు) వేప మొక్కను తెచ్చి ఇంటి ఆవరణలో, బాల్కనీలో పెంచుకోవచ్చు. ఈ మొక్కలు నర్సరీల్లో లభిస్తాయి. ఇక ఇంట్లో  పొగ వేసే టైంలో.. అందులో కొన్ని ఎండిన వేపాకుల్ని వేస్తే.. ఆ వాసనకు  దోమల మైండ్ బ్లాంక్ అవుతుంది.  ఎండిన వేపాకుల పొడితో ఇంట్లో  పొగ  వేసినా మంచిదే. అలాగని పొగ కోసం అతిగా వేపాకు పొడి వేస్తే.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడతారు.

2. తులసి మొక్క

తులసి మొక్క ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం ఉండదు. వాటి పవర్ గురించి అందరికీ తెలుసు. చాలా ఇళ్లలో పూజా విధుల కోసం తులసి మొక్కలు పెంచుతుంటారు. తులసి ఆకుల నుంచి వెలువడే వాసనకు దోమలు బెదిరి పారిపోతాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే.. తులసి మొక్క నుంచి కొన్ని ఆకులను తీసుకోండి. వాటిని నీటిలో మరిగించి, ఇళ్లంతా స్ప్రే చేయండి. ఇలా చేస్తే దోమలు, ఈగలు పారిపోతాయి.

Also read : China New Map Vs India : అరుణాచల్, ఆక్సాయ్ చిన్ చైనావేనట.. డ్రాగన్ ‘కొత్త మ్యాప్’ పై దుమారం !

3. బంతి పూల మొక్క

బంతిపూలను సాధారణంగా దేవుళ్లను పూజించడానికి వాడుతుంటాం. బంతి మొక్కలను పెరట్లో లేదా ఇంటి ఆవరణలో పెంచుకోవడం మంచిది. బంతిపూల నుంచి వెలువడే సువాసనలో ఫైరేత్రం అనే  సమ్మేళనం ఉంటుంది. దీని ధాటికి దోమలు ఇంట్లోకి రావు.

4. నిమ్మగడ్డి

దోమలను తరిమి కొట్టే నిమ్మగడ్డి మీకు ఆయుర్వేద దుకాణాల్లో దొరుకుతుంది.  ఈ గడ్డి నుంచి తీసిన సిట్రోనెల్లా నూనె (నిమ్మ నూనె) దోమలను తరిమేస్తుంది. గదిలో అక్కడక్కడ ఈ నూనెను చల్లితే దోమల బాధ ఉండదు.

5.లావెండర్ మొక్క (Plants Bomb Vs Mosquitoes)

లావెండర్ మొక్క సువాసనలను వెదజల్లుతూ ఉంటుంది. ఇవి మనకు ఇష్టంగా ఉన్నా.. దోమలకు  మాత్రం ప్రాణాంతకంగా ఉంటుంది. అందుకే ఈ మొక్కలను పెంచుకోవడం వల్ల దోమలు ఇంట్లోకి రావు. ఒకవేళ ఈ మొక్కను పెంచుకునే వీలు లేకపోతే.. లావెండర్ నూనెను ఇంటి మూలల్లో  స్ప్రే చేస్తే సరిపోతుంది.

6.పుదీనా మొక్క

పుదీనా మొక్కను ఇంట్లో పెంచుకోవడం మంచిది. దీనివల్ల దోమలు ఇంట్లోకి రావు. పుదీనా మొక్కను పెంచుకోవడానికి వీలు లేకపోతే.. పిప్పర్మెంట్ ఆయిల్ ని ఒక బాటిల్ లో తీసుకొని ఇంటిమూలల్లో స్ప్రే చేయాలి. ఆ ఘాటైనా వాసనకు దోమలు ఇంటిలోకి రావు.