Site icon HashtagU Telugu

Brinjal: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా వంకాయలను అస్సలు తినకూడదట!

Brinjal

Brinjal

వంటింట్లో దొరికే కాయగూరలలో వంకాయ కూడా ఒకటి. ఈ వంకాయను ఉపయోగించి ఎన్నో రకాల ప్రత్యేక వంటకాలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే మనలో కొందరు వంకాయలు తినడానికి ఇష్టపడితే మరి కొందరు తినడానికి అస్సలు ఇష్టపడరు. వంకాయలు తింటే దురదగా ఉంటుందని, అలర్జీలు వస్తాయని చాలామంది వంకాయను దూరం పెడుతూ ఉంటారు. కాగా వంకాయలో ఎన్నో ఔషదగుణాలు ఉంటాయి. వంకాయ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను కూడా అందిస్తుంది. అంతేకాదు ఈ కూరగాయ ఎంతో టేస్టీగా కూడా ఉంటుంది. అందుకే వంకాయను ఎన్నో రకాలుగా వండుకుని తింటుంటారు.

అయితే వంకాయను తినడం మంచిదే కానీ కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయలు అసలు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు వంకాయలు తినకూడదు అన్న విషయానికి వస్తే.. వంకాయ మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అలాగే గుండె జబ్బులు కూడా దూరంగా ఉంటాయి. వంకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయినప్పటికీ ఈ వంకాయలకు కొంతమంది దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు వంకాయలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు.

వంకాయల్లో ఆక్సలేట్ అనే మూలకం ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల పరిమాణాన్ని మరింత పెంచుతుంది. అందుకే వీళ్లు వంకాయను తినకూడదట. మగవారితో పోలిస్తే ఆడవారే రక్తహీనతతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు కూడా వంకాయను తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వంకాయను తింటే శరీరంలో ఇనుము లోపం మరింత పెరుగుతుందట. దీంతో మీ సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే మీకు ఎలాంటి అలెర్జీ సమస్య ఉన్నా వంకాయలను పొరపాటున కూడా తినకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే వంకాయల్లో ఎన్నో సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కూడా అలెర్జీ సమస్యను మరింత పెంచుతాయట. అలాగే మీ జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నా, కడుపు సమస్యలతో తరచుగా బాధపడుతున్నా వంకాయను పొరపాటున కూడా తినకూడదట. ఎందుకంటే ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. గ్యాస్, ఎసిడిటీ వంటి జీర్ణసమస్యలు ఉంటే వంకాయను తినకపోవడమే మంచిది. అలాగే కంటి సమస్యలున్నవారు కూడా వంకాయను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.