Site icon HashtagU Telugu

Summer: వేసవికాలం వచ్చింది కదా అని కొబ్బరి నీళ్ళు తెగ తాగేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

Summer

Summer

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కొబ్బరినీళ్లు మనకు సీజన్ తో సంబంధం లేకుండా అన్ని రకాల సీజన్లలో లభిస్తూ ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఎక్కువగా ఆరోగ్యం బాగోలేని వారు తాగుతూ ఉంటారు. మరి ముఖ్యంగా వేసవికాలంలో రోడ్డు పక్కన ఎక్కడ చూసినా కూడా కొబ్బరి బొండాలు పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంటాయి.. వేసవికాలంలో ఈ కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కొబ్బరి నీళ్లు తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు. మరి వేసవి కాలంలో కొబ్బరినీరు ఎక్కువగా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

కొబ్బరి నీరు ఆరోగ్యం, హైడ్రేషన్ కోసం ఒక అద్భుతమైన సహజ పానీయం. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి, అలసట,బద్ధకం పెరుగుతాయట. చాలా మంది హీట్ స్ట్రోక్ తో కూడా బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్లు శరీరాన్ని డిహైడ్రేట్ కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా వేడిని తగ్గించి శరీరాన్ని చల్లబరుస్తాయట. కొబ్బరి నీళ్లలో క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ సి, ప్రోటీన్, సోడియం, ఫాస్ఫరస్, ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా లభిస్తాయట. అంతేకాదు కొబ్బరి నీళ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి 2, విటమిన్ బి 3 కూడా ఉంటాయని చెబుతున్నారు. కొందరికి మాత్రమే వాస్తవానికి కొబ్బరి నీళ్లు అనేక ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన నేచురల్ డ్రింక్ అయినప్పటికీ ఇది అందరికీ సరైనది కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీరు ఎక్కువగా తాగితే సమస్యలు ఎదుర్కోవడం గ్యారెంటీ అని చెబుతున్నారు.

మూత్ర పిండాల సమస్యలు, లో బీపీ, షుగర్, కొబ్బరి అలెర్జీలు ఉన్నవారు కోకోనట్ వాటర్ జోలికి పోకపోవడమే మంచిదని చెబుతున్నారు. వీళ్లు కొబ్బరికాయ తాగకపోవడమే మంచిదట. డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదు. కొబ్బరి నీళ్లలో సహజంగానే చక్కెర ఉంటుంది. అయితే ఎక్కువగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయట. మధుమేహ వ్యాధిగ్రస్తులు మితంగా మాత్రమే తాగాలని లో బీపీ లేదా హైపోటెన్షన్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగకూడదని, కొబ్బరి నీళ్లలో రక్తపోటును తగ్గించే గుణాలు ఉన్నాయని చెబుతున్నారు. లో బీపీ ఉన్నవారు లేదా హై బీపీ మెడిసిన్స్ వాడుతున్నవాళ్లు కొబ్బరినీళ్లు తాగితే తలనొప్పి, తిమ్మిరి, అలసట వంటి సమస్యలు వస్తాయట. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగకూడదట. కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు శరీరంలో పొటాషియం నిల్వలను తగ్గించలేకపోతే అది హైపర్‌క లేమియా సమస్యకు దారితీస్తుందని, దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.