- బొప్పాయిని తినకూడని వారు
బొప్పాయి వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
బొప్పాయి వల్ల కలిగే లాభాలు
Papaya: బొప్పాయి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం ముంది ఇష్టపడే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు బొప్పాయి పండును ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే బొప్పాయి మంచిదే కానీ కొందరికి అసలు మంచిది కాదని చెబుతున్నారు. ఇంతకీ బొప్పాయిని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బొప్పాయిలో పపైన్ ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల గర్భధారణ సమయంలో గర్భాశయంలో సంకోచాలు ప్రారంభమవుతాయట.
ఇవి సమయానికి ముందే ప్రసవానికి కారణమవుతాయట. కొన్నిసార్లు గర్భస్రావానికి దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది లేటెక్స్ అలెర్జీ సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు బొప్పాయికి దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ తింటే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. దాంతో దద్దుర్లు, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది , శరీరంలో వాపు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే బొప్పాయిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కిడ్నీల్లో రాళ్ల సమస్య ఉన్నవారు కూడా బొప్పాయిని తినకపోవడం మంచిదని చెబుతున్నారు. పొరపాటున తింటే కిడ్నీల్లో రాళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశం ఉంటుందట. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు బొప్పాయి అవాయిడ్ చేస్తే మంచిదట.
బొప్పాయి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుందని,,అయితే ఏదైనా గుండె జబ్బుతో బాధపడేవారు మాత్రం బొప్పాయి తినకపోవడం మంచిదట. ఎందుకంటే బొప్పాయిలో హృదయ స్పందనలు సక్రమంగా ఉండకుండా చేసే కొన్ని పదార్థాలు ఉంటాయని చెబుతున్నారు. బొప్పాయి షుగర్ రోగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అయితే చక్కెర స్థాయి తక్కువగా ఉన్నవారు లేదా హైపోగ్లైసీమియాతో బాధపడుతున్నవారు వైద్యుడి సలహాతో బొప్పాయిని తినాలి ఎందుకంటే ఇది గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని చెబుతున్నారు.
బొప్పాయి వీరికి చాలా డేంజర్.. పొరపాటున తిన్నారో ఇక అంతే సంగతులు!
బొప్పాయి వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ కొందరికి మాత్రం అసలు మంచిది కాదట. మరి బొప్పాయిని ఎవరు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Papaya
Last Updated: 18 Dec 2025, 10:18 AM IST