Health Care: ఈ 6 సమస్యలు ఉన్నవారు అస్సలు పాలు తాగకండి.. తాగితే అంతే సంగతులు?

పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పాలలో ప్రొటీన్లు, విటమిన్‌ ఏ, బీ1, బీ1, బీ2, బీ12, బి6 , డీ, క్యాల్షియ

  • Written By:
  • Publish Date - July 21, 2023 / 09:30 PM IST

పాలు తాగడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పాలలో ప్రొటీన్లు, విటమిన్‌ ఏ, బీ1, బీ1, బీ2, బీ12, బి6 , డీ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, జింక్‌, ఫాస్ఫరస్‌ పాంథోనిక్‌ యాసిడ్‌, సెలీనియమ్‌, నియాసిన్‌ లాంటి పోషకాలు లభిస్తాయి. ప్రతిరోజూ పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పాలు తాగితే ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా, బలంగా ఉంటాయి. ఎముకలకు కావాల్సిన క్యాల్షియం కూడా పల్లో లభిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. చర్మం, జుట్టు హెల్తీగా ఉంటాయి. రోజు పాలు తాగడం వల్ల మానసిక ఆరోగ్యానికీ ఎంతో మేలు జరుగుతుంది.

పాలలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పాలు తాగితే ప్రమాదకరం అంటున్నారు వైద్యులు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారు పాలు తాగకూడదు. లివర్‌లో కొవ్వు పేరుకుపోవడాన్ని ప్యాటీ లివర్‌ అని అంటారు. లివర్‌లో కొవ్వు పేరుకుపోయి ఇన్ఫ్లమేషన్‌కు దారితీస్తుంది. అలాగే లాక్టోస్ అసహనం ఉన్నవారు పాలు తాగకూడదట. చిన్న ప్రేగు తగినంత లాక్టేజ్ ఉత్పత్తి చేయకపోతే లాక్టోస్‌ అసహనం వచ్చే అవకాశం ఉంది. ఇది ఇది పాలలో చక్కెరను జీర్ణం చేయడానికి ఒక ఎంజైమ్. పాలు తాగిన ముప్పై రెండు గంటల తర్వాత మీకు ఏదైనా కడుపులో అసౌకర్యం ఉంటే లాక్టోస్ అసహనం ఉన్నట్లు నిర్ధరించుకోండి. పాలు తాగిన తర్వాత కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురైతే వాళ్లు పాలు తాగకపోవడమే మంచిది.

చాలామందికి పాలు తాగిన తర్వాత కడుపులో తిప్పడం, ఇబ్బందిగా అనిపించడం, వికారంగా అనిపించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కొంతమంది వ్యక్తులు పాలు తాగిన తర్వాత భయపడుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పాలకు దూరంగా ఉండటమే మంచిది. ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ ఉన్నవారు పాలు తాగకపోవడమే మంచిది. పాలు తాగిన తర్వాత.. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, మలం నుంచి రక్తం వస్తుంటే పాలు తాగవద్దు. ఈ లక్షణాలకు అర్థం మీకు మిల్క్‌ అలర్జీ ఉన్నట్లు. ఇలాంటి వ్యక్తులు పాలు అస్సలు తాగకూడదు. గుండె సమస్యలు ఉన్నవారు పాలు తాగకూడదు.