Mens Health : 40ఏళ్ల తర్వాత పురుషులకు ఈ పోషకాలు తప్పనిసరి..!!

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 08:01 AM IST

వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు చుట్టుముడుతుంటాయి. ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా 40ఏళ్ల తర్వాత పురుషులకు పోషకాలతో నిండిన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే ఎముకలు, కండరాలు బలాన్ని కోల్పోతాయి. అందుకే పురుషులు మంచి ఆరోగ్యం పొందాలంటే మంచి జీవనశైలిని అవర్చుకోవాలి.

40ఏళ్ల తర్వాత అధిక రక్తపోటు, షుగర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. అందుకే పోషకాలతో నిండిన ఆహారంతోపాటు స్థిరత్వాన్ని కొనసాగించాలి. 40ఏళ్లు నిండిన పురుషులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చూద్దాం.

కాల్షియం, విటమిన్ డి:
వయస్సు పెరుగుతున్నా కొద్దీ ఎముకలు బలాన్ని కోల్పోతాయి. అందుకే కాల్ఫియం, విటమిన్ డి సప్లిమెంట్స్ అవసరం. విటమిన్ డి సూర్యకాంతిలో లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరానికి తాగేలా చూసుకోవాలి. దీంతోపాటుగా గుడ్లు,చికెన్, పప్పులు తీసుకోవాలి. పాలు పదార్థాలతోపాటు బచ్చలికూర, పన్నీర్ కూడా తీసుకోవచ్చు. ఇందులో విటమిన్ డి లభిస్తుంది.

ఫైబర్ :
40ఏళ్లు వచ్చాక జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందుకే ఫైబర్ చాలా అవసరం. షుగర్ వంటి సమస్య ఉంటే పీచుపదార్థం లేదా ఫైబర్ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి పురుషులు ఆకుకూరలు, పండ్లు, పప్పులు తీసుకోవాలి. ఇవి తీసుకుంటే శరీరంలోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతోపాటు శరీర బరువును సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

పొటాషియం కంటెంట్:
పురుషులకు పొటాషియం కంటెంట్ ఎక్కుగా ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. బచ్చలికూర, పండ్లు, చికెన్ తీసుకోవాలి.

శారీరక శ్రమ:
శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ముఖ్యంగా 40ఏళ్ల తర్వాత పురుషులు మోనోపాజ్ కు వెళ్తారు. కాబట్టి వ్యాయామం, మానసిక ఆరోగ్యాన్ని భర్తీ చేస్తుంది. ఉబకాయంతోపాటు ఇతర జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.