Site icon HashtagU Telugu

Bathing: స్నానం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పుడు అస్సలు చేయకండి?

Bathing

Bathing

మామూలుగా కొందరు ఉదయం సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తే మరి కొందరు రోజుకు కేవలం ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేయడం మంచిదే కానీ స్నానం చేసేటప్పుడు కొన్ని రకాల తప్పులు చేయకూడదు. మరి స్నానం చేసేటప్పుడు ఎటువంటి పొరపాట్లను చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వర్కవుట్‌ అయిన వెంటనే స్నానం చేయకపోవడం తప్పు. కాబట్టి వ్యాయామం చేసిన వెంటనే స్నానం కచ్చితంగా చేయాలి. వర్కవుట్‌ చేసిన తర్వాత చెమట కారణంగా చర్మంపై బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. వెంటనే స్నానం చేయకపోతే శరీరం అంతటా దద్దుర్లు వచ్చే అవకాశం ఉంటుంది.

నిద్రపోయే ముందు చల్ల నీటితో స్నానం చేయకూడదు. అదేవిధంగా ఉదయాన్నే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రోగనిరోధక శక్తి పెరుగి డిప్రెషన్‌ కూడా తగ్గుతుంది. అయితే నిద్రపోయే ముందు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది. జుట్టు బలహీనంగా, పలుచగా ఉన్నవారు ప్రతిరోజూ తలస్నానం చేయడం మంచిది కాదు. అలా జుట్టు బలహీనంగా పలుచగా ఉన్నవారు వారానికి రెండుసార్లు హెడ్‌ బాత్‌ చేయడం మంచిది. చాలామంది షవర్‌ను చాలా కాలంగా ఉపయోగిస్తున్నప్పటికి షవర్‌ హెడ్‌ను శుభ్రం చేయరు.

షవర్‌ హెడ్‌ శుభ్రం చేయకపోతే దానిలో మలినాలు పేరుకుపోతాయి. ఇలా షవర్‌ చేస్తే ఆరోగ్యానికి హాని జరిగే ప్రమాదం ఉంది.షవర్‌ హెడ్‌లో ఊపిరితిత్తులకు హాని చేసే బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే చాలామంది ఒకే టవల్‌ ఎక్కువ రోజులు ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఒకే టవల్ ని ఎక్కువ రోజులు ఉపయోగించకూడదు. టవల్‌ను ఒళ్లు తుడుచుకోవడానికి మూడు సార్లు మాత్రమే వాడాలని అంటున్నారు. ఆ తర్వాత దాన్ని ఉతకాలి. తడిగా ఉన్న టవల్‌తో తుడుకోవద్దు. తడి టవల్‌ ఉపయోగిస్తే దానిపై బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. స్నానం చేసిన వెంటనే బాత్ టబ్ శుభ్రం చేయడం మంచిది. తేమ కారణంగా, ఈకోలి వంటి బ్యాక్టీరియా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. బాత్‌టబ్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ను నివారించవచ్చు.

Exit mobile version