Diabetes Mistakes: పొరపాటున కూడా ఈ ఐదు తప్పులు చేస్తే షుగర్ పెరిగిపోవడం ఖాయం?

రోజురోజుకీ డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా చాలా మంది ఈ డయాబెటిస్ బారిన పడుతున

  • Written By:
  • Publish Date - September 14, 2023 / 10:10 PM IST

రోజురోజుకీ డయాబెటిస్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా చాలా మంది ఈ డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే ఈ డయాబెటిస్ వచ్చిన వారు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేయడం వల్ల ఆహార విషయంలో చేసే పొరపాట్ల వల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోయి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే ఈ ఐదు రకాల తప్పులు చేస్తే కనుక షుగర్ లెవెల్స్ పెరగడం ఖాయం అంటున్నారు వైద్యులు.. మరి ఆ ఐదు రకాల తప్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఉదయం పూట మనం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌తో మన రోజు మొదలవుతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌ మన శరీరంలో జీవక్రియలకు దోహదం చేస్తుంది. మన రోజువారీ పనులు చేసేందుకు శక్తిని అందిస్తుంది. టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారు బ్రెక్‌ఫాస్ట్‌ తప్పనిసరి. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లేకుండా మధ్యాహ్నం వరకు ఏమీ తినకుండా ఉంటే టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారిలో లంచ్, డిన్నర్ తర్వాత హైపర్గ్లైసీమియా, బలహీనమైన ఇన్సులిన్ ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఉదయం పూట టిఫిన్‌ తింటే ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్‌లోని బీటా కణాల పనితీరును నిరోధించవచ్చు. అలాగే షుగర్‌ ఫేషెంట్స్‌ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలి. ప్రతి రోజూ వ్యాయమం చేస్తే బరువు కంట్రోల్‌లో ఉంటుంది.

ఇది స్ట్రోక్‌, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. డయాబెటిక్స్‌ రోజూ వ్యాయమం చేస్తే ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. శరీరం కణాలు రక్తం నుంచి గ్లూకోజ్‌ను తగ్గించి శక్తి కోసం ఉపయోగించుకుంటుంది.కాబట్టి శారీరక శ్రమ లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కవ అవుతాయి.​ ప్రశాంతమైన నిద్రకు, డయాబెటిస్‌ నిర్వహణకు దగ్గర సంబంధం ఉంది. నిద్రలేమి కారణంగా బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌లో ఆకస్మిక, లాంగ్‌ స్పైక్‌లకు దారితీస్తుంది. టైప్‌ 2 డయాబెటిస్‌ ఉన్నవారు ప్రతి రోజు రాత్రి 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి. నిద్రలేమి ఇన్సులిన్‌ విడదలను తగ్గిస్తాయి. ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ విడుదలను ప్రేరేపిస్తుంది. నోరు శుభ్రంగా లేకపోయినా, దంత క్షయం, చిగుళ్ల సమస్యలు టైప్‌ 2 డయాబెటిస్‌ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. టైప్-2 మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా బ్రష్ చేయడం, ఫ్లాస్ ఉపయోగించడం, తరచుగా మౌత్‌ చెకప్‌ల చేయించుకోవాలి. డయాబెటిక్‌ పేషెంట్స్‌ చక్కెరకు బదులుగా.. ఆర్టిఫిషియల్‌‌‌‌‌ స్వీటెనర్‌ తీసుకుంటూ ఉంటారు. కానీ, ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. ఆర్టిఫిషియల్‌ స్వీటెనర్లు దీర్ఘకాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. .