Site icon HashtagU Telugu

Juices to ease Period Pain: పీరియడ్స్‌ టైమ్‌లో ఈ జ్యూస్‌లు తాగితే.. నొప్పి మాయం..!

Juices To Ease Period Pain

Juices To Ease Period Pain

నెలసరి సమయంలో స్త్రీలను కడుపునొప్పి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ప్రతినెల నెలసరి వచ్చినప్పుడు స్త్రీలు ఈ కడుపు నొప్పితో విలవిలాడుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆ నొప్పిని అలాగే భరిస్తే మరి కొంత మంది మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గాలంటే కొన్ని రకాల జ్యూసులు తాగడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు వైద్యులు. ఆ జ్యూస్ లు ఏంటి అన్న విషయానికి వస్తే.. పైనాపిల్‌ జ్యూస్‌.. నెలసరి సమయంలో ఇబ్బంది పెట్టే నొప్ప నుంచి ఉపశమన ఇస్తుంది. పీరియడ్స్‌ పెయిన్‌ గర్భాశయ లైనింగ్‌ సంకోచాలా కారణంగా వస్తుంది. పీరియడ్స్ సమయంలో పైనాపిల్ జ్యూస్ తీసుకోవడం వల్ల గర్భాశయం రిలాక్స్ అవుతుంది, నొప్పి తగ్గుతుంది. పైనాపిల్‌ జ్యూస్‌లో విటమిన్లు, మినరల్స్‌, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి.

అలాగే బీట్‌రూట్ జ్యూస్‌ కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిలోని పోషకాలు నెలసరి సమయంలో బ్లీడింగ్‌ సక్రమంగా జరిగేలా చేస్తుంది, పీరియడ్స్‌ నొప్పిని కూడా తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉంటాయి, ఇది రక్త నాళాలను సడలించడంలో సహాయపడుతుంది. ఇది గర్భాశయాన్ని రిలాక్స్ చేస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది. బీట్‌రూట్‌లోని ఆర్గానిక్‌ యాసిడ్స్‌, లాక్టిక్‌ యాసిడ్‌ను చెదరగొట్టి నొప్పిని తగ్గిస్తుంది.

పీరియడ్స్ సమయంలో బొప్పాయి జ్యూస్‌ తాగితే.. కడుపు నొప్పి, అసౌకర్యం దూరం అవుతాయి. బొప్పాయిలో విటమిన్లు, మినరల్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి న్యాచురల్‌ అనాల్జేసిక్‌గా పని చేస్తుంది. బొప్పాయిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నెలసరి నొప్పిని తగ్గిస్తాయి. క్యారెట్‌లోని పోషకాలు మీ శరీరంలో అదనపు ఈస్ట్రోజెన్‌ను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. ఇది మీ శరీరంలో బాధాకరమైన తిత్తులు ఏర్పడకుండా చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్‌ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ ఋతు చక్రాన్ని నియంత్రించడానికి, పీరియడ్స్‌ నొప్పిని తగ్గించడానికి తోడ్పడుతుంది.

ఆరెంజ్ జ్యూస్‌లో కాల్షియం, విటమిన్ సి, ఇ వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు పీరియడ్స్ వల్ల వచ్చే తిమ్మిర్లు, నొప్పిని తగ్గించడానికి తోడ్పడతాయి. ఆరెంజ్‌ జ్యాస్‌ పెయిన్‌ కిల్లర్‌కు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది. పీరియడ్స్‌ సమయంలో యాపిల్‌ జ్యూస్‌ తాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌ జ్యూస్‌లోని పోషకాలు అండాశయ క్యాన్సర్‌ ప్రమాదాన్ని 70 శాతం వరకు తగ్గించడానికి సహాయపడతాయి. యాపిల్‌ జ్యూస్‌ కడుపు నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది.