Site icon HashtagU Telugu

Non Veg: చికెన్ పై నిమ్మరసం వేసుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

Web Quick And Easy Lemon Chicken 2 1200x720

Web Quick And Easy Lemon Chicken 2 1200x720

నాన్ వెజ్ లో చాలామంది ఎక్కువ పకోడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కర్రీలతో పోల్చుకుంటే పకోడాని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కర్రీ తిన్నప్పుడు కొంచెం తిన్న పకోడా మాత్రమే ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే చికెన్ పకోడా ఫిష్ ఇ.లాంటివి ఉన్నప్పుడు ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ తప్పనిసరిగా ఉండాల్సిందే. చాలామందికి నిమ్మకాయ లేకపోతే పకోడా తిన్నట్టు కూడా అనిపించదు. పకోడా మీద నిమ్మ పండు రసం పిండి తింటూ ఉంటారు. చికెన్‌పై నిమ్మరసం పిండడం వల్ల, వండేటప్పుడు నిమ్మరసం పిండడంతో చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు.

నిమ్మరసం చికెన్‌పై పిండడం, చికెన్‌ లో నిమ్మరసం వండి వేయడం వల్ల అందులోని ఆమ్లత్వం ప్రోటీన్స్‌ ని విచ్ఛిన్నం చేస్తుంది. దీంతో చికెన్ మరింత సాఫ్ట్‌ గా యమ్మీగా మారుతుందట. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ కారణంగా ప్రోటీన్స్ చిన్నచిన్న కణాలుగా విడిపోతాయట. దీంతో ఈజీగా జీర్ణం అవుతుందని చెబుతున్నారు. అలాగే సాధారణంగా నాన్‌వెజ్ తిన్నప్పుడు జీర్ణ సమస్యలు రాకుండా ఇలా నిమ్మరసం వేసి తినడం మంచిదట. నిమ్మరసం ఆమ్లత్వం చికెన్‌ కి మంచి రుచిని ఇస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా స్కిన్ నుండి కొవ్వుని బ్యాలెన్స్ చేస్తుందట. దీంతో రుచి కూడా పెరుగుతుందట.

తిన్నప్పుడు రుచిగా కూడా ఉంటుందట. అందుకే మనం రెస్టారెంట్‌ కి వెళ్ళినప్పుడు ఉల్లిపాయలు, నిమ్మముక్కలు సర్వ్ చేస్తుంటారు. వీటిని మనం ఓన్లీ ఉల్లిపాయల పై పిండి తినడానికి మాత్రమే కాదు. చికెన్ వంటి డిషెస్‌ పై కూడా చల్లి తినవచ్చట.చికెన్‌ని మెరినేట్ చేయడం వల్ల దీర్ఘకాలిక సమస్యలు, వృద్ధాప్య సమస్యలు కూడా తగ్గుతాయి. వంట చేసేటప్పుడు అభివృద్ధి అయ్యే సమ్మేళనాలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే నిమ్మలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆహారం నుండి ఇనుముని గ్రహించేందుకు సహాయపడుతుంది. చికెన్‌ లో లీన్ ప్రోటీన్, అవసరమైన విటమిన్స్, బి6, బి12, ఐరన్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. చికెన్‌ లో కాల్షియం కూడా ఉంటుంది. దీనిని సరిగ్గా గ్రహించేందుకు బాడీకి విటమిన్ సి అవసరం అని చెబుతున్నారు నిపుణులు.

Exit mobile version