వేసవికాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు వడదెబ్బ సమస్య కూడా ఒకటి. సరిగా భోజనం చేయకుండా ఉండేవారు సరిగా ఆహార పదార్థాలు పానీయాలు తీసుకోకుండా ఉండేవారు వడదెబ్బ బారిన ఎక్కువగా పడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఈ వడదెబ్బ బారిన పడినవారు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. అయితే ఈ వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… వేసవికాలంలో బయటకు వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో అస్సలు వెళ్ళకూడదు. కాటన్ దుస్తులు ధరించాలి. ఫుల్ స్లీవ్ షర్టులు ధరించడం మంచిది.
బూట్లు సాక్స్ కి బదులుగా చెప్పులు వంటి వేసుకోవడం మంచిది. అలాగే బయట నుంచి వచ్చిన వెంటనే నీళ్లు తాగకూడదు. వేసవికాలంలో ఎండిన వేప ఆకుల పొడి నీటిలో వేసి మరిగించి, చల్లారిన తర్వాత తలస్నానం చేసే నీటిలో కలిపి చేస్తే మేలు జరుగుతుందట. అలాగే స్నానం చేసే నీటిలో వేపాకులను ఉడికించి ఆ నీటిని ఉపయోగించడం మంచిదని చెబుతున్నారు. ఇది చెడు వాసనను పోగొట్టడం మాత్రమే కాకుండా చర్మంపై కురుపులు దురద వంటి వాటి నుంచి ఉపశమనం కూడా అందిస్తుందని చెబుతున్నారు. అలాగే సీజనల్ లో దొరికే పెరుగు,మజ్జిగ, సీజనల్ పండ్లు, ద్రాక్ష,బొప్పాయి, కళింగర వంటివి తీసుకోవాలని చెబుతున్నారు. నీటిని ఎక్కువగా తీసుకోవాలట. బార్లీని నీటిలో నాన బెట్టి మరిగించి తయారు చేసిన సత్తు తాగితే హీట్‌స్ట్రోక్ నుండి కాపాడుతుందని చెబుతున్నారు.
అలాగే ఉల్లిపాయ రసం తాగితే వడ దెబ్బ రాకుండా చేస్తుందట. దీనితో పాటు, ఉల్లిపాయ రసాన్ని అరికాళ్ళపై పూయడం కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందట. పిల్లలు, వృద్ధులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, గుండె జబ్బులతో బాధపడేవారు, శారీరకంగా బలహీనంగా ఉన్నవారు ఎండలోకి వెళ్లకుండా చూడాలని చెబుతున్నారు. ఎక్కువ ద్రవాలు త్రాగాలి. బయటికి వెళ్ళినప్పుడు క్యాప్, లేదా గొడవలు వంటివి వెంట తీసుకెళ్లడం మంచిది. మీ కళ్ళను రక్షించడానికి , మీ చెవులను వేడి స్ట్రోక్ నుండి రక్షించడానికి సన్ గ్లాసెస్ ధరించడం మంచిది. చింతపండు, కొత్తిమీర, పచ్చి మామిడి, ఉల్లిపాయలను ఎల్లప్పుడూ ఇంట్లో ఉంచాలట. అలాగే చెమటలు పట్టేటప్పుడు చల్లటి నీరు ఎక్కువగా తాగడం ప్రమాదకరం. వీలైతే, ఎల్లప్పుడూ నీటిని మీతో ఉంచుకోవడం మంచిది. కొద్దికొద్దిగా త్రాగుతూ ఉండాలి. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఉండదట. చింతపండు గుజ్జును నీటిలో కలిపి తాగడం వల్ల వేడి వల్ల వచ్చే వాంతులు, జ్వరంలో మేలు జరుగుతుందట. వడదెబ్బ తగిలితే చింతపండు గుజ్జును నీటిలో కలిపి అరచేతులకు, అరికాళ్లకు రాసుకుంటే మంచి జరుగుతుందని చెబుతున్నారు. వేడి కారణంగా అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి తలపై చింతపండు గుజ్జును కలిపి పూయడం వల్ల మేలు జరుగుతుందట.