ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అధిక బరువును తగ్గించుకోవడానికి వ్యాయామాలు,ఎక్సర్సైజులు చేయడం, డైట్ లు ఫాలో అవ్వడం జిమ్ కి వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గలేదని దిగులు చెందుతూ ఉంటారు. అయితే బరువు తగ్గాలి అంటే మీ డైట్ లో కొన్ని రకాల పండ్లను చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే ఖచ్చితంగా బరువు పెరుగుతారని చెబుతున్నారు. కాబట్టి కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఈజీగా బరువు తగ్గవచ్చట.
ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాల్లో సాధారణంగా కేలరీలు తక్కువగా ఉంటాయి. అవి సులభంగా జీర్ణమవుతాయి. మరి డైట్ లో ఎలాంటి పండ్లు చేర్చుకోవాలి అన్న విషయానికి వస్తే.. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీలు, కోరిందకాయలు వంటి అర కప్పు బెర్రీల్లో 32 కేలరీలను మాత్రమే కలిగి ఉంటాయి. ఈ పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారట. అంతేకాదు వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తాయట. అదేవిధంగా 100 గ్రాముల ఆపిల్స్ లో 50 కేలరీలు ఉంటాయి. వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది.
ఆపిల్స్ లో పెక్టిన్ చాలా ఉంటుంది. దీనిలో ఉండే కరిగే ఫైబర్స్ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అంతేకాదు ఇవి మన శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే బొప్పాయి పండు కూడా బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుందట. బొప్పాయిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు మాత్రం తక్కువగా ఉంటాయి. బొప్పాయిలో డైజెస్టివ్ ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట. అలాగే జీవక్రియను పెంచుతుందట. ఒక కప్పు బొప్పాయిలో 62 కేలరీలు మాత్రమే ఉంటాయట. బరువు తగ్గడానికి తినాల్సిన పండ్లలో మరొక పండ్లు నారింజ పండు.
వీటిలో కేలరీలు తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.కాబట్టి వీటిని తింటే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారట. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కివీ పండును రెగ్యులర్ డైట్ లో చర్చుకోవాలనీ చెబుతున్నారు. ఈ పండ్లలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. కివీ పండ్లలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండు ఇమ్యూనిటీని పెంచడంతో పాటుగా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందట.